English   

ప‌వ‌ర్ స్టార్ అప్పుడే సినిమాలు వ‌ద్ద‌నుకుంటున్నాడా..

 Pawan Kalyan
2020-04-14 14:26:30

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ‌ర‌స సినిమాలు చేస్తుండ‌టంతో పండ‌గ చేసుకుంటున్నారు అభిమానులు. ఈ ఏడాది ఓ సినిమా.. వ‌చ్చే ఏడాది కుదిర్తే రెండు సినిమాలు వ‌స్తాయ‌ని వాళ్లు క‌ల‌ల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ల క‌ల‌ల‌కు బ్రేకులేస్తున్నాడు ప‌వ‌న్ కళ్యాణ్. కోర‌నా ఎఫెక్ట్ తో ఈయ‌న సినిమాల‌పై మ‌ళ్లీ మ‌న‌సు మార్చుకున్న‌ట్లు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఒప్పుకున్న మూడు సినిమాలు పూర్తైన త‌ర్వాత కొత్త సినిమాలేవీ వ‌ద్ద‌నుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ లెక్క‌న‌ వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్, హ‌రీష్ శంక‌ర్ సినిమాలు మాత్ర‌మే ప్ర‌స్తుతం ప‌వ‌న్ న‌టిస్తున్న‌వి. ఆ త‌ర్వాత డాలీ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ‌తో మ‌ల్టీస్టార‌ర్ అనుకున్న‌ది మ‌ళ్లీ అట‌కెక్కిన‌ట్లే క‌నిపిస్తుంది. కరోనా భయంతో షూటింగ్స్ నిలిచిపోవడంతో ప‌వ‌న్ ప్లాన్స్ అన్నీ డిస్ట‌ర్బ్ అవుతున్నాయి.

వీలైనంత త్వ‌ర‌గా సినిమాలు పూర్తి చేసి రాజ‌కీయాలు చేసుకుందామ‌నుకున్న ప‌వ‌న్ కు క‌రోనా ఇప్పుడు చావుదెబ్బ కొట్టింది. అస‌లే ఒప్పుకున్న సినిమాలు ఎక్కువ‌గా ఉండ‌టం.. షూటింగ్స్ త్వ‌ర‌గా పూర్తి చేద్దామ‌నుకుంటే ఇప్పుడిలా అనుకోకుండా సినిమాలన్నీ ఉన్న‌ప‌లంగా ఆగిపోవ‌డంతో నెక్ట్స్ సినిమాల విష‌యంలో ప‌వ‌న్ ఆలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు తెలుస్తుంది. అభిమానులు కోరుకున్న‌ట్లు మూడు సినిమాలు చేసి ఇక చాలు అనుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. క్రిష్ సినిమా ఇప్ప‌టికే మొద‌లైంది.. హరీష్ శంకర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ మూడు సినిమాల త‌ర్వాత కొత్త సినిమాల‌కు దూరంగా ఉండ‌బోతున్నాడు ఈయ‌న‌. కానీ చాలా మంది నిర్మాత‌లు ప‌వ‌న్ కోసం క్యూ క‌ట్టారు. 

మ‌రి వాళ్ల‌కు ఆయ‌నేం చెప్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అదీ కాక ఈయ‌న చాలా మంది నిర్మాత‌ల ద‌గ్గ‌ర అడ్వాన్సులు కూడా తీసుకుని.. డేట్స్ ఇస్తాన‌ని చెప్పిన‌ట్లు కూడా తెలుస్తుంది. మ‌రి వాళ్ల‌కు ఎప్పుడు సినిమా చేసి పెడ‌తాడ‌నేది కూడా తెలియ‌దు. ఏదేమైనా కూడా క‌రోనా కార‌ణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌న‌సు కూడా మారిపోయిందిప్పుడు. 

More Related Stories