English   

చిరంజీవి తొలి సినిమా రచయిత కన్నుమూత.. 

cs rao died
2020-04-14 21:31:41

ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకటి మరిచిపోయే లోపే మరొకటి వచ్చేస్తుంది. మొన్నటికి మొన్న ఒకేరోజు రెండు విషాదాలు జరిగాయి. రాజీవ్ కనకాల చెల్లి.. తమ్మారెడ్డి తల్లి ఒకేరోజు చనిపోయారు. ఇదిలా ఉంటే కన్నడలోనూ ఓ స్టార్ కమెడియన్ కన్నుమూసాడు. ఇప్పుడు మరో ప్రముఖుడు కన్నుమూసాడు. చిరంజీవి తొలి సినిమా ప్రాణం ఖరీరు కథ రాసిన సిఎస్ రావు మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈ సుప్రసిద్ధ సినీ, నవలా రచయిత, నటుడు చింతపెంట సత్యనారాయణ రావు ఎప్రిల్ 14న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 

మెగాస్టార్ చిరంజీవి మొదటి చిత్రం ప్రాణం ఖరీదుతో పాటు ఆ తర్వాత కుక్కకాటుకు చెప్పుదెబ్బ, జాతీయ అవార్డు చిత్రం ఊరుమ్మడి బతుకులు, నాయకుడు వినాయకుడు, మల్లెమొగ్గలు వంటి ఎన్నో సినిమాలకు కథలు అందించారు. అలాగే ఎన్టీఆర్ నటించిన సరదా రాముడు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సొమ్మొకడిది సోకొకడిది వంటి చిత్రాల్లో నటించారు. నాటక రంగానికి విశేషమైన సేవ చేసి ఎన్నో అవార్డులని సైతం గెలుచుకున్నారు. ఎందరో నటీనటులకి ఆచార్యులుగా కూడా వ్యవహరించారు. సీఎస్‌ రావు ప్రస్తుతం చిక్కడపల్లి గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు సింగపూరులో ఉండడం వల్ల రాలేని పరిస్థితి నెలకొంది. లాకౌట్ నియమాలను గౌరవించి ఎవ్వరూ పరామర్శకు వ్యక్తిగతంగా వచ్చే ప్రయత్నం చేయవద్దని కుటుంబ సభ్యులు సినీపరిశ్రమ మిత్రులని, శ్రేయోభిలాషులని కోరారు. ఎప్రిల్ 15న హైదరాబాదులోనే సీఎస్‌ రావు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. 

More Related Stories