English   

బాలీవుడ్ నిర్మాతకు రెండోసారి కూడా కరోనా పాజిటివ్..

morani
2020-04-15 13:54:42

కరోనా మహమ్మారి ఒకర్ని వదిలితే మరొకర్ని అంటుకుంటుంది. నిన్నటి వరకు కూడా బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు ఉందని బాధ పడ్డారు.. ఆమెకు పరీక్షల్లో రెండోసారి నెగిటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి డిశార్జ్ చేశారు వైద్యులు. హమ్మయ్యా అనుకునేలోపు ఇప్పుడు మరో సెలబ్రిటీకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరీం మొరాని కూతురు షాజా మొరానికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఈమె ఆసుపత్రిలో చేరింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌కు ఎంతో సన్నిహితుడైన కరీం మొరాని... ఆయనతో రా.. వన్, చెన్నై ఎక్స్‌ప్రెస్ లాంటి సినిమాలకు సహ నిర్మాతగా కూడా ఉన్నాడు. ఈ మధ్యే  ఆస్ట్రేలియా నుంచి ముంబైకి వచ్చిన షాజా... తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధ పడుతోంది.

టెస్టులు చేసిన తర్వాత వైద్యులు ఈమెకు కరోనా పాజిటివ్ అని తేల్చారు. దాంతో ఐసోలేషన్ వార్డుకు పంపిన అధికారులు.. ఆమె కుటుంబ సభ్యులను కూడా ఉన్నపలంగా క్వారంటైన్‌కు పంపించారు. ఈ క్రమంలోనే తన పెద్ద కూతురుకు షాజా మొరానితో పాటు తన చిన్న కూతురుకు కూడా కరోనా ఉందని తెలిసింది. ఈ మధ్యే ఈమె రాజస్థాన్ నుంచి వచ్చింది. షాజా మొరానీ బాయ్ ఫ్రెండ్ ప్రియాంక్ శర్మకు కూడా టెస్టులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇద్దరు కూతుళ్ల నుంచి కరీం మొరానీకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈయనకు రెండోసారి కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళన పడుతున్నారు కుటుంబ సభ్యులు. ముఖ్యంగా అంటు వ్యాధి కావడంతో వీళ్ల నుంచి ఎవరికీ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఏదేమైనా కూడా బాలీవుడ్ ను కూడా కరోనా బాగానే భయపెడుతుంది.

More Related Stories