English   

మరిది కోసం వదిన.. అఖిల్ సినిమాలో సమంత..

akhil
2020-04-15 07:20:13

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ అన్ లక్కీ వారసుడు ఎవరైనా ఉన్నారా అంటే అది అక్కినేని అఖిల్. అద్భుతమైన బ్యాగ్రౌండ్.. అదిరిపోయే ఇమేజ్ ఉన్న ఇంటి నుంచి వచ్చాడు.. పెద్ద దర్శకులతో పని చేసాడు అయినా కూడా ఈయన కోరుకున్న విజయం రావడం లేదు. ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో పాపం అఖిల్ కోసం నాగార్జున కూడా చాలా కష్టాలే పడుతున్నాడు. చిన్న కొడుకుకు హిట్ సినిమా ఎలా తీసుకురావాలో తెలియక తంటాలు పడుతున్నాడు. ప్రస్తుతం ఈయన బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. ఔట్ పుట్ చూసిన తర్వాత మరోసారి సినిమాను ఎడిట్ చేయాలని నాగార్జున దర్శకుడిని కోరినట్లు తెలుస్తుంది. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమాలో సమంత గెస్ట్ రోల్ చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తన సినిమాలో నటించాలని మరిది స్వయంగా వదిన సమంతను కోరినట్లు ప్రచారం జరుగుతుంది. నాగార్జున కూడా చెప్పడంతో దీనికి ఆమె కూడా సరే అందనే వార్తలొస్తున్నాయి.

సినిమాలో సమంత కోసం బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఓ ప్రత్యేకమైన సీన్ క్రియేట్ చేసాడని.. అఖిల్ పై ఉన్న అభిమానంతో సమంత కూడా చేయడానికి ఒప్పుకుందని అక్కినేని వర్గాల నుంచి వస్తున్న వార్తలు. ఈ సినిమాపై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఇది హిట్ అయితేనే అతని కెరీర్ బాగుంటుంది.. లేదంటే మాత్రం ఫెయిల్యూర్స్ వారసుడిగా నిలిచిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎలాగోలా నాగ చైతన్య ఇప్పుడు నిలబడ్డాడు.. తనకంటూ ప్రత్యేకంగా మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు అఖిల్ కూడా ఇది చేయాల్సిందే.. లేదంటే సమస్యలు చాలానే వచ్చేలా కనిపిస్తున్నాయి. మరి సమంత లెగ్ అయినా అఖిల్ కు విజయాన్ని తీసుకొస్తుందో లేదో చూడాలిక.

More Related Stories