English   

సాహోలు వద్దు.. మిర్చిలు కావాలంటున్న ప్రభాస్ ఫ్యాన్స్..

prabhas
2020-04-15 07:37:46

బాహుబ‌లి సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు ప్రభాస్. ఈ సినిమా తర్వాత సాహోతో వచ్చి హిందీలో మనసులు దోచుకున్నాడు కానీ సొంత ప్లేస్ లో మాత్రం చితికిలపడ్డాడు. దాంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ బాగా నిరుత్సాహంలో ఉన్నారు. ఈయన నుంచి పర్ఫెక్ట్ మాస్ సినిమా చూసి చాలా ఏళ్ళైపోయింది. బాహుబలి సిరీస్ పక్కన బెడితే చాలా రోజులుగా ప్రభాస్ ఎందుకో కానీ ప్రయోగాలు చేస్తున్నాడు. సాహో మాస్ సినిమా అనడానికి లేదు. ఇది పూర్తి స్టైలిష్ యాక్షన్ డ్రామా. హాలీవుడ్ సినిమాల మాదిరి అన్నమాట.. దాంతో ఫ్యాన్స్ కు ఈయన భారీగానే బాకీ పడిపోయాడు. కొరటాల శివ, పూరీ జగన్నాథ్ లాంటి మాస్ దర్శకులతో పని చేయ్ డార్లింగ్ అంటూ ప్రభాస్ ను అడుగుతున్నారు అభిమానులు. కుర్ర దర్శకులతో పని చేస్తే వాళ్లు ప్రభాస్ ఇమేజ్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు.

సుజీత్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్.. రాధాకృష్ణ కుమార్ కూడా లవ్ స్టోరీ చేస్తున్నాడు.. దాంతో ఈయన నుంచి కోరుకుంటున్న మాస్ సినిమా అయితే రావడం లేదు. ప్యాన్ ఇండియన్ ఇమేజ్ ఓకే కానీ ఆ మత్తులో పడి సొంత రాష్ట్ర అభిమానులను పట్టించుకోకపోతే ఎలా అంటున్నారు ఫ్యాన్స్. కచ్చితంగా మేం కోరుకుంటున్న మాస్ సినిమా ఇవ్వాల్సిందే అంటూ ప్రభాస్ ను ఫ్యాన్స్ గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. కొరటాల శివతో ఓ సినిమా చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ అదెంత వరకు నిజమనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పటికే నాగ్ అశ్విన్ తో సినిమాకు కమిటయ్యాడు.. దాంతో పాటే కెజియఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ప్రభాస్ ఓ సినిమా చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు కూడా ప్యాన్ ఇండియన్ సినిమాలే. దాంతో పక్కా మాస్ సినిమా చేయడానికి చాలా కాలం పడుతుందేమో..?

More Related Stories