English   

టైటిలే కాదు కధ కూడా లీక్ చేసిన చిరంజీవి...జక్కన్నకి థాంక్స్ 

chiranjeevi
2020-04-15 10:46:46

చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర మీద చాలా ప్రచారాలు జరిగాయి. అయితే ఎట్టకేలకి చిరంజీవి నటించే పాత్ర గురించి ఇప్పటి దాకా ఉన్న సస్పెన్స్ ముగిసింది. “ఆచార్య” సినిమా యొక్క థీంని స్వయానా మెగాస్టార్ చెప్పేశాడు. ప్రస్తుత లాక్ డౌన్ కాలంలో చిరంజీవి ఫోన్‌ లో వార్తాపత్రికలకు చెందిన జర్నలిస్టులకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. 

తాజాగా ఒక ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి తాను “జనతా గ్యారేజ్” లో ఎన్‌టిఆర్ తరహా పాత్ర పోషించనున్నట్లు లీక్ ఇచ్చారు. ఎలా అంటే జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ ప్రకృతి ప్రేమికుడిగా, పర్యావరణాన్ని పరిరక్షించేవాడి పాత్ర పోషించాడో ఆచార్యలో కూడా అలాంటి పాత్ర తాను పోషిస్తున్నట్టు చెప్పారు. “ఆచార్య”లో, చిరంజీవి సహజ వనరుల పరిరక్షణ కోసం పోరాడే ఒక ప్రొఫెసర్‌ గా నటిస్తున్నానని ఆయన చెప్పారు. ఈ ప్రొఫెసర్ ఒక మాజీ నక్సలైట్ కూడా అట. ఇక ఈ ప్రొఫెసర్ కి శిష్యుడి పాత్రలో రామ్ చరణ్ నటించనున్నారని అంటున్నారు. 

అయితే శివ గత సినిమాల్లనే ఇది కూడా అన్ని ఎమోషనల్ అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడి ఉంటుందని అన్నారు. ఇక చరణ్ ని ఈ సినిమాలో నటించే అవకాశం ఇస్తున్నందుకు తాను జక్కన్నకి థాంక్స్ చెబుతున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి అనుకున్నట్టుగానే ఈ సినిమా టైటిల్ సహా, ప్లాట్ అంతా చిరంజీవే లీక్ చేసేసారు. 

More Related Stories