English   

అందరూ బాగుండాలి అందుకే మళ్ళీ డైరెక్షన్ చేయను 

Vennela Kishore
2020-04-15 12:36:09

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి కమెడియన్స్ అంతా దాదాపు కనుమరుగు అయినట్టే. చాలా మంది కాలం చేయగా బ్రహ్మానందం లాంటి వాళ్ళు అప్పుడప్పుడూ మెరుస్తున్నారు. ఇక ఇప్పుడు పరిశ్రమలో మోస్ట్‌ వాంటెడ్‌ కమెడియన్‌ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు వెన్నెల కిషోర్‌. వెన్నెల అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన పేరు వెన్నెల కిషోర్ గా ఫిక్స్ అయిపొయింది. ఇక ఆయనకి నటనలోనే కాదు దర్శకత్వం విభాగంలోనూ మంచి పట్టు ఉంది. అప్పట్లో తన దర్శకత్వ ప్రతిభను నమ్ముకొని బ్రహ్మానందంతో ‘జప్ఫా’ అనే ఒక సినిమా కూడా చేశారు. అయితే అది అది బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టిందనుకోండి అది వేరే విషయం. ఈ దెబ్బతో మనోడు మళ్ళీ దర్శకత్వం జోలికి వెళ్లలేదు. 

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ‘మళ్లీ దర్శకత్వం వహిస్తారా అనే ప్రశ్న ఎదురుకాగా ఆయన తనదైన శైలిలో కౌంటర్ వేశాడు. మీరందరూ బాగుండాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో మళ్లీ అలాంటి ఆలోచన చెయ్యకూడదని  అనుకుంటున్నాని బదులిచ్చాడు. ఇక తాను ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నానని అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నితిన్ రంగ్ దే, అల్లు అర్జున్ పుష్ప చిత్రాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో కూడా తాను నటిస్తున్నట్లు వెన్నెల కిషోర్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా గురించి చాలా ఆసక్తిగా ఉన్నానని.. ఇప్పటికే వారం రోజుల షూటింగ్ లో పాల్గొన్నాని కిషోర్ చెప్పుకొచ్చారు.  

More Related Stories