English   

షాకింగ్ అప్డేట్ .. ప్రభాస్ పాత్ర చనిపోతుందా 

 Prabhas
2020-04-15 12:55:12

బాహుబలి లాంటి అంతర్జాతీయ స్థాయి సినిమా తరువాత గత ఏడాది ప్రభాస్ నుండి వచ్చిన సాహోకి అన్ని వర్గాల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. హిందీలో సాహో సూపర్ హిట్ కాగా తెలుగుతో పాటు సౌత్ బాషలలో ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన తదుపరి చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్ డ్రామా 'జాన్' మీద పై చాల ఆశలే పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఐతే కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టు నడుస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ ఎప్పుడవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్‌ అంతా ఆపేసి ఎవరిళ్లలో వారు కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అయితే ఈ సినిమా గురించిన ఒక లేటెస్ట్ అప్డేట్ చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక గాసిప్ ఇప్పుడు బయటకి వచ్చింది. అదేంటంటే ప్రభాస్ ఈ సినిమాలో రెండు పాత్రలలో నటిస్తున్నాడట. అందులో ఒక పాత్ర తాలూకా ఎండింగ్ మరీ ఎమోషనల్ గా ఉంటుందట. ఒక క్యారెక్టర్ క్లైమాక్స్ లో చనిపోతుందని అంటున్నారు. ఈ సినిమానికి ‘జాన్’ అనే పేరుతో పాటు ‘ఓ డియర్, రాధేశ్యామ్’ అనే రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. 2021 సంక్రాంతి కానుకగా ఈ మూవీని విడుదల చేయాలని భావించినా, అది కుదిరేలా లేదు. చూద్దాం ఏమవుతుందో ?

More Related Stories