కరోనా మీద జున్ను సందేశం

కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఒక్కరు కూడా దీనికి సరయిన మందు కనిపెట్టేలక పోవడంతో దీనికి నివారణ ఏ కానీ మందు లేదనేది జనాల్లోకి బాగా వెళ్ళింది. బయట అత్యవసర సర్వీసుల వాళ్ళు నిత్యావసరాల కోసం వెళ్ళే జనాలు తప్ప ఇంకా ఎవరూ కనిపించడమే లేదు. ఇక సినిమా సెలబ్రిటీలు ఎవరికీ వారు తమకు తోచినంత సహాయం చేసి ఎవరి ఇళ్ళలో వాళ్ళు లాకయిపోయారు. ఇక కొంతమంది స్టార్స్ సోషల్ మీడియా వేదికగా ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తు, ఈ కరోనా మీద అవగాహన పెంచే పనిలో ఉన్నారు. ఇప్పుడు వారే కాదు వాళ్ల పిల్లలు కూడా ముద్దు ముద్దు మాటలతో కరోనాపై జాగ్రత్తలు చెబుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.
తాజాగా కుర్ర హీరో నాని కొడుకు జున్ను కూడా ఇలా తన ముద్దు ముద్దు మాటలతో కరోనా మీద అవగాhaన పెంచే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ‘‘జున్ను సందేశం’’ అంటూ నాని తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో జున్ను తన ఇంటి కిటికీ నుంచి బయటకు చూస్తుండగా నాని ‘‘జున్ను బయటెవరున్నారు?’’ అని ప్రశ్నించాడు. దానికి జున్ను కరోనా వైరస్ అని బదులిచ్చాడు. ‘‘ఇప్పుడు మనం ఏం చెయ్యాలి’’ అని నాని తిరిగి ప్రశ్నించగా.. ‘‘ఇంట్లోనే ఉండాలి’’ అని జవాబిచ్చాడు జున్ను. దీంతో నాని మళ్లీ ‘అప్పుడేం జరుగుతుంది’’ అని అడగ్గా.. ‘‘గో కరోనా వైరస్ గో’’ అంటూ చిరునవ్వులు జున్ను. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.