తమిళ్ లో అల వైకుంఠపురము..హీరో ఆయనే

చాలా గ్యాప్ తీసుకుని చేసిన అల వైకుంఠపురములో సినిమాతో మళ్ళీ టాప్ హీరోల లిస్టులో తన స్థానం పదిలం చేసుకున్నాడు. అల వైకుంఠపురములో సినిమాతో సంక్రాంతికి వచ్చి అసలు ఇప్పటి దాకా నమోదయిన నాన్ బాహుబలి రికార్డులు తిరగరాసాడు ఈయన. ప్రస్తుతం ఈ సినిమా జోష్ లో సుకుమార్ తో చేయాల్సిన సినిమా కోసం బాష నేర్చుకుంటున్నాడు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా మీద ఇతర బాషల మేకర్స్ కన్ను పడింది.
అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి రీమేక్ రైట్స్‌ను బాలీవుడ్ కి చెందిన అశ్విన్ వర్దే కొనేశారని అక్షయ్ కుమార్ హీరోగా ఈ సినిమా తెరకెక్కిస్తారని ఒక ప్రచారం అయితే నడుస్తోంది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా రీమేక్ రైట్స్ తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నిర్మాత కూడా కొన్నారని చెబుతున్నారు. ఈ సినిమాలో హీరోగా శివకార్తికేయన్ ను తీసుకునే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే లాక్డౌన్ పూర్తయ్యాక ఈ రీమేక్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు.