English   

నా జీవితం బయోపిక్‌కు సరిపోదంటున్న చిరంజీవి.. 

Chiranjeevi
2020-04-15 17:03:11

తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీలలో కూడా ఇప్పుడు బయోపిక్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది. హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా కొత్తగా కథ రాయాల్సిన పని ఉండదు. ఉన్న కథనే కాస్త కొత్తగా చెప్తే చాలు. పైగా సెలెబ్రిటీస్ జీవితాలకు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇప్పటికే తెలుగులో సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి లెజెండ్స్ బయోపిక్స్ వచ్చాయి. ఇందులో మహానటి సంచలన విజయం సాధించడమే కాకుండా కీర్తి సురేష్ కు నేషనల్ అవార్డ్ కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు చిరంజీవి బయోపిక్ కూడా వస్తుందేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి. 

దీనిపై అప్పట్లో నాగబాబు లేదనే సమాధానమే చెప్పాడు. అన్నయ్య జీవితంలో అంత డ్రామా లేదని.. ఆయన జీవితం సినిమాగా సరిపోదని అప్పట్లో చెప్పాడు మెగా బ్రదర్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన బయోపిక్ గురించి ఓపెన్ అయ్యాడు. నాగబాబు చెప్పినట్లు ఇప్పుడు అన్నయ్య కూడా చెప్పేసాడు.

తన జీవితంలో బయోపిక్ కు సరిపోయేంత మసాలా లేదని.. అన్ని ఎమోషన్స్ కానీ.. మలుపులు కానీ రావని చెబుతున్నాడు మెగాస్టార్. ఇప్పటి వరకు నా ప్రయాణాన్ని బుక్ లా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను.. ఆటో బయోగ్రఫీ రాస్తున్నాను.. దాన్నే వీడియో కూడా చేస్తానని చెప్పాడు చిరు. అంతేకానీ బయోపిక్ చేసేంత మెలో డ్రామా తన జీవితంలో లేదని తేల్చేసాడు చిరంజీవి. 

సైరా టైమ్ లో మాత్రం బయోపిక్ గురించి మరోలా చెప్పాడు చిరంజీవి. ఒకవేళ తన బయోపిక్ చేయాల్సి వస్తే మాత్రం రామ్ చరణ్ తన పాత్రకు న్యాయం చేస్తాడనే నమ్మకం తనకున్నా కూడా కొన్ని సమస్యలున్నాయంటున్నాడు మెగాస్టార్. తన బయోపిక్‌లో రామ్ చరణ్ కంటే వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్‌లలో ఎవరో ఒకరు హీరోగా నటిస్తే బాగుంటుందని చెప్పాడు చిరంజీవి. ఈ ముగ్గురిలో తన పోలికలు ఎక్కువగా కనిపిస్తాయని తన సన్నిహితులు ఎప్పుడూ చెబుతూ ఉంటారని.. అందుకే వీళ్లలో ఎవరు నటించినా బాగుంటుందన్నారు. కానీ ఎవరు చేసినా.. తమ కుటుంబ నటులే చేస్తే బాగుంటుందని చెప్పాడు చిరంజీవి. అయితే బయోపిక్ మాత్రం అవసరం లేదని మరోమాటగా చెప్తున్నాడు ఈయన.

More Related Stories