English   

పాయల్ రాజ్‌పుత్‌కు కాబోయే మొగుడు ఎలా ఉన్నాడో చూస్తారా..

payal
2020-04-15 19:12:04

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి సంచలనంగా దూసుకొచ్చిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. ఆ సినిమా తర్వాత  మరో రెండు మూడు సినిమాలు చేసినా కూడా ఆమెకు కోరుకున్న గుర్తింపు రాలేదు. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉంది పాయల్. ఓ వైపు కెరీర్ లో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె చాలా బిజీగా మారిపోయింది. ఇన్నాళ్లూ ఈమె సింగిల్ అని అంతా అనుకున్నారు.. కానీ తను ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి ఒకరితో మింగిల్ అయి ఉన్నాయని ఇప్పుడు సోషల్ మీడియాలో తెలిపింది పాయల్ రాజ్ పుత్. తన పేరు ప్రియుడు సౌరబ్ ను అభిమానులకు పరిచయం చేసింది. మరోవైపు కెరీర్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పాకులాడుతూ ఉంది పాయల్ రాజ్ పుత్. ఎవరైనా ఒకటి రెండు సినిమాలు ఒకే జోనర్ లో చేస్తే వాళ్లను అదే తాటికి కట్టేస్తారు మన ప్రేక్షకులు. దర్శక నిర్మాతలు కూడా వాళ్లు అదే అని ఫిక్స్ అయిపోతారు. వరుసగా రెండు ఫ్యామిలీ సినిమాలు చేస్తే ఆ హీరోయిన్ పై అదే ముద్ర పడిపోతుంది. అదే రెండు బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేసింది అంటే ఆమెపై అలాంటి ముద్ర పడిపోతుంది. తాజాగా పాయల్ రాజ్ పుత్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ఈ భామ ఎక్స్పోజింగ్ ను నమ్ముకుంది.

తొలి రెండు సినిమాలు rx100, rdx లవ్  లో అలాంటి పాత్రలు చేయడంతో ఆమెపై ఆ ముద్ర పడిపోయింది. దాంతో దర్శక నిర్మాతలు కూడా పాయల్ రాజ్ పుత్ అంటే అలాంటి సినిమాలు చేస్తుంది అంటూ ఒక అంచనాలకు వచ్చేశారు. రెమ్యూనరేషన్ బాగా ఇస్తే కచ్చితంగా అలాంటి కథలకు పాయల్ రాజ్ పుత్ ఓకే చెబుతుందని ప్రచారం ఇండస్ట్రీలో బాగా ఎక్కువైపోయింది. ఇలాంటి సమయంలో తాను నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నానని.. అందుకే ఈ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు తనకు అవసరం లేదని చెబుతోంది. ఈ మధ్య ఒక దర్శకుడు వచ్చి ఇది మీకు మాత్రమే సరిపోయే కథని చెప్పాడని తెలుస్తోంది. తీరా హీరోయిన్ చెప్పమని అడిగితే కథ మొదలు పెట్టిన అరగంటలోనే అరడజను బెడ్రూం సీన్లు చెప్పాడని ప్రచారం జరుగుతుంది. దాంతో పూర్తిగా వినకుండానే సినిమాకు నో చెప్పేసింది పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం ఈమె తెలుగులో సరైన సినిమా కోసం వేచి చూస్తుంది. మరోవైపు బాయ్ ఫ్రెండ్ కూడా సమయం కేటాయిస్తుంది.

 

More Related Stories