English   

కొరటాల శివ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ ప్రకటన..

 Koratala Siva
2020-04-16 02:23:26

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అపజయం లేకుండా దూసుకుపోతున్న దర్శకులు కేవలం ముగ్గురు మాత్రమే. అందులో రాజమౌళి ఎప్పటిలాగే ముందు వరుసలో ఉండగా.. ఆ తర్వాత కొరటాల శివ, అనిల్ రావిపూడి ఉన్నారు. ఈ ముగ్గురు దర్శకులతో పని చేయడానికి స్టార్ హీరోలు కూడా ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో రాజమౌళి పక్కనబెడితే కొరటాల శివ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇంకా అనిల్ రావిపూడి తన దారిలో వెళ్తున్నాడు. ఇలాంటి సమయంలో కొరటాల శివ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన త్వరలోనే రిటైర్ అవుతానని చెప్పి నిర్మాతలను సందిగ్ధంలో పడేశాడు. ఇంత సూపర్ కెరీర్ వదిలేసి అప్పుడే రిటైర్మెంట్ తీసుకోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు.

అయితే తాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడే కేవలం పది సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తన దగ్గర ఉన్న పది కథలు అయిపోయిన తర్వాత దర్శకత్వానికి దూరం కానున్నట్లు తెలిపారు ఆయన. మరో ఐదేళ్ల పాటు మాత్రమే తను ఇండస్ట్రీలో ఉంటానని.. ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని చెబుతున్నాడు. ఈ నిర్ణయం విన్న తర్వాత అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. మీలాంటి దర్శకుడికి మరో కథ రాయడం పెద్ద కష్టమైన పని కాదు.. అనవసరంగా ఈ నిర్ణయాలు తీసుకోవద్దు అని చెబుతున్నారు. 

కానీ కొరటాల శివ మాత్రం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇండస్ట్రీకి వచ్చాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా నాలుగు విజయాల తర్వాత ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నాడు కొరటాల శివ. మరి ఈయన దగ్గర ఉన్న పది కథలు అయిపోయిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి తాను రిటైర్ అవుతానని ప్రకటించాడు ఈ దర్శకుడు. ఒకవేళ నిజంగానే రిటైర్ అయితే మాత్రం అంతకంటే సంచలనం మరొకటి ఉండదు. 

More Related Stories