English   

నయనతార అంతకంత అనుభవిస్తుంది.. ప్రభుదేవా మాజీ భార్య శాపం..

prabhudev
2020-04-15 19:40:24

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. మొత్తం దక్షిణాది ఇండస్ట్రీలో నయనతారకు.. ఆమె ప్రేమకథలకు ఉన్న క్రేజ్ ఏంటో తెలుసు. ప్రేమ లేకుండా అస్సలు ఉండలేదు ఈ ముద్దుగుమ్మ. 20ల్లోనే ఉన్నపుడే శింబును ప్రేమించింది.. తర్వాత విడిపోయింది. 30లకు చేరువయ్యాక ప్రభుదేవాతో ప్రేమలో పడింది. శింబుకు అంటే పెళ్లి కాలేదు ఏమో అనుకోవచ్చు. కానీ ప్రభుదేవాకు అప్పటికే పెళ్లై 15 ఏళ్లైపోయింది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబం కూడా ఉంది.. అలాంటి కుటుంబంలోకి నయనతార మధ్యలో వెళ్లిపోయింది. దాంతో ప్రభు కాపురం ముక్కలైపోయింది. అప్పటి వరకు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఒక్కసారిగా విడాకుల వరకు వెళ్లిపోయింది. కానీ చివరి నిమిషంలో ప్రభుదేవా కూడా నయనతారతో విడిపోయాడు. ఆ విషయం అంతా మరిచిపోయినా కూడా ప్రభుదేవా మాజీ భార్య రమాలత్ మాత్రం ఇప్పటికీ నయనతారపై చిందులు తొక్కుతూనే ఉంది. ఆమె కనిపిస్తే చంపేయాలన్నంత కసితో రమాలత్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కూడా నయనతారను విమర్శిస్తుంది ఈమె. కేవలం నయనతార వల్లే తన కాపురం రోడ్డున పడింది.. తన బతుకు బజారు పాలైందని చెబుతుంది రమాలత్. 1995లో ప్రభుదేవా, రమాలతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఆమె ముస్లిం అమ్మాయి అయినా కూడా ప్రభుదేవా కోసం మతం కూడా మార్చుకుంది. 15 ఏళ్ల కాపురంలో తన భర్త ఏనాడూ తనను ఒక్క మాట అనలేదని.. ప్రాణంగా చూసుకున్నాడని చెబుతుంది రమాలత్. కానీ నయనతార వచ్చిన తర్వాత అసలు గొడవలు మొదలయ్యాయని చెప్పింది ఈమె. నయనతార కోసమే 2011లో తన భార్య రమాలత్‌కు విడాకులు కూడా ఇచ్చాడు ప్రభుదేవా. దానికోసం ఆమెకు భారీగా భరణం కూడా ఇచ్చాడు. నయనతార వల్లే తన జీవితం.. కాపురం.. అంతా నాశనమైపోయిందని.. తన బతుకు రోడ్డున పడిందని రమాలత్ మండి పడుతుంది. తన భర్తను తనకు కాకుండా చేసిన నయనతారను దేవుడు శిక్షిస్తాడని.. పెళ్లైన మగాళ్ల వైపు చూసే ఆడవాళ్లను కఠినంగా శిక్షించాలని ఆమె కోరుకుంటుంది. మొత్తానికి ప్రభుదేవా మాజీ భార్య మాత్రం ఇప్పటికి అదే తలుచుకుని బాధ పడుతూనే ఉంది.

More Related Stories