English   

ఆచార్య కథ ఏంటో చెప్పేసిన కొరటాల శివ..

siva
2020-04-15 20:32:04

దర్శకుడు కొరటాల శివ ఒకే ఒక్క ఇంటర్వ్యూలో చాలా విషయాలు వెల్లడించాడు. మరీ ముఖ్యంగా తన రిటైర్మెంట్ గురించి కూడా చెప్పి సంచలనం రేపాడు. ఇక ఇప్పుడు తెరకెక్కిస్తున్న చిరంజీవి ఆచార్య సినిమా కథ గురించి కూడా హింట్ ఇచ్చాడు ఈ దర్శకుడు. అంతా అనుకుంటున్నట్లు ఇదేదో దేవాదాయ శాఖ చుట్టూ తిరిగే కథ కాదని చెప్పకనే చెప్పాడు ఈయన. దాంతో పాటు సినిమాలో నక్సలైట్ పాత్రపై కూడా క్లారిటీ ఇచ్చేసాడు ఈయన. ఆచార్య సినిమా పొలిటికల్ థ్రిల్లర్ అని బాంబ్ పేల్చేసాడు ఈ దర్శకుడు. ఇదివరకు చిరంజీవి రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు చాలానే చేసాడు. అందులో ఆయన ఇమేజ్ కూడా బాగానే పనికొచ్చింది. ఇప్పుడు రాజకీయాల నుంచి బయటికి వచ్చిన తర్వాత చేస్తున్న తొలి పొలిటికల్ సినిమా ఇది.

ఇందులో ప్రకృతి ప్రేమికుడిగా చిరు పాత్ర ఉంటుందని కన్ఫర్మ్ చేసాడు కొరటాల శివ. గతంలో జనతా గ్యారేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రకృతి ప్రేమికుడిగానే కనిపించాడు. ఇప్పుడు మరోసారి చిరంజీవి పాత్రను కూడా అలాగే డిజైన్ చేసాడు ఈ దర్శకుడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఉన్న విషయాన్ని కొరటాల కూడా కన్ఫర్మ్ చేసాడు. ఆయనకు కూడా హీరోయిన్ ఉంటుందని చెప్పాడు. సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అని.. అందులో చిరంజీవి ఇమేజ్ కు సరిపోయే కథతో పాటు ఎమోషన్స్.. మాస్ ఎలిమెంట్స్ అన్నింటితో పాటే సందేశం కూడా ఉంటుందని చెప్పాడు కొరటాల శివ. షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయిందని చెప్పాడు ఈయన. విడుదలపై క్లారిటీ ఇవ్వలేదు కొరటాల శివ.

More Related Stories