English   

నాని చేసిన పనికి ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రశంసలు..

ntrtrust
2020-04-16 07:15:48

లాక్ డౌన్ కారణంగా అంతా ఇంట్లోనే ఉండిపోతున్నారు. అయితే బయట పరిస్థితులు కూడా ఇప్పుడు బాగోలేవు. కరోనా రోజురోజుకీ కరాళ నృత్యం చేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో రక్తదానం చేసే వాళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు చాలా మంది రక్తదానం స్వయంగా వచ్చి చేసే వాళ్లు. కానీ ఇప్పుడు తగ్గిపోవడంతో అలాంటి వాళ్లలో ఉత్తేజం నింపడానికి నాని దంపతులు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు రక్తదానం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రక్తదానం చేసేందుకు ముందుకొచ్చిన నానికి ట్రస్ట్‌ సెల్యూట్‌ చేసింది. ఆయన ఇచ్చిన రక్తం ఎంతోమంది జీవితాల్ని కాపాడుతుందని.. ప్రత్యేకించి తలసేమియాతో బాధ పడుతున్న చిన్నారులకు ఈ రక్తం ఎంతో అవసరమని ట్వీట్‌ చేసింది. నాని మాదిరే మరికొందరు కూడా వచ్చి రక్తదానం చేస్తారని వాళ్లు ఊహిస్తున్నారు.

అంతేకాదు ఇదే సందర్భంగా రక్తదానం సమయంలో నాని ఇచ్చిన సందేశం వీడియోను కూడా షేర్‌ చేసింది ట్రస్ట్. 'మన చుట్టూ పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. అందుకే అందరం ఇంట్లో ఉన్నాం. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. తలసేమియాతో వేల మంది చిన్నారులు బాధపడుతున్నారు. వారికి రక్తం చాలా అవసరం. వారికే కాదు.. ఆపరేషన్లకు, ఇతర చికిత్సలకు రక్తం కావాలి. కొవిడ్‌-19 వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో చాలా మంది బయటికి వచ్చి రక్తం ఇవ్వడానికి భయపడిపోతున్నారు. అసలు దీనికి, కొవిడ్‌-19కు ఎటువంటి సంబంధం లేదు. ఇంతకుముందు కంటే ఈ సమయంలో రక్తదానం చాలా అవసరం. మీరు కూడా దానం చేసి, జీవితాల్ని రక్షించండి' అని నాని ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నాడు.

More Related Stories