English   

నానితో హిట్ డైరెక్టర్ సినిమా...అంతా ఒట్టిదేనట 

Sailesh Kolanu
2020-04-16 10:46:47

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలు ప్రకటించారు. నాని హీరోగా మరో ‘వీ’సినిమా తన అభిమానుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత ఆయన టక్ జగదీశ్ ఆ తరువాత  శ్యామ్ సింగ రాయ్ సినిమాలు ను చేసేందుకు రెడీగా ఉన్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ షూట్ మధ్యలో ఆగింది. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 

ఈ క్రమంలో నాని దర్శకుడు శైలేశ్ కొలనుకు అవకాశం ఇచ్చినట్టుగా ఫిల్మ్ నగర్లో ప్రచారం సాగింది. ఎందుకంటే కొత్త దర్శకులతో నాని మొదటి నుంచి ఆసక్తిని చూపిస్తూనే వస్తున్నాడు. అలా తన నిర్మాణంలో హిట్ సినిమా చేసి హిట్ కొట్టిన శైలేశ్ కు దర్శకుడిగా అవకాశం ఇస్తున్నారని ప్రచారం జరిగింది.  అయితే ఇందులో నిజం లేదని అంటున్నారు. ఈ విషయం మీద దర్శకుడే అనధికారికంగా క్లారిటీ ఇచ్చినట్టు చెబుతున్నారు. నాని గారికి అసలు కధే చెప్పలేదని అలాంటప్పుడు సినిమా ఎలా ఓకె అవుతుందనేది ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారట.

More Related Stories