English   

మహేష్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ 

 mahesh27
2020-04-16 13:12:02

ఈ యేడాది మొదట్లోనే సంక్రాంతికి మహేష్ బాబు-అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కూడా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత సినిమాగా మహేష్ పరుశురామ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ముందు వంశీ పైడిపల్లి తో సినిమా ఉంటుందని అనుకున్నా కారణాలు ఏవయినా కానీ ఆ ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టారు. నిజానికి పరశురామ్ తో సినిమా ఇప్పటికే లాంచ్ కావాల్సి ఉన్నా అది కుదరలేదు. ఇక ఈ సినిమా కరోనా ఎద్దడి తగ్గాక కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31న లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంచించాలని ప్లాన్ చేస్తున్నారు.  

ఇక ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట్ ను కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి  మ్యూజిక్ డైరెక్టర్ గా గోపీ సుందర్ ని ఫైనల్ చేశారట మహేష్ అండ్ డైరెక్టర్. నిజానికి పరశురామ్ గత సినిమా గీత గోవిందం సినిమాకి గోపీ సుందర్ చక్కటి పాటలిచ్చాడు. ఈ సినిమా ఆడియో ఆల్బమ్ హిట్టయ్యింది. ఈ నేపధ్యంలో గోపీ సుందర్ నే మహేష్ బాబు సినిమా కోసం తీసుకోవాలని డైరెక్టర్ పరశురామ్ మహేష్ కి రిఫర్ చేయగా అందుకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అందుకే ఆయన్ను ఈ ప్రాజెక్ట్ లోకి రోప్ చేశారని అంటున్నారు. నిజానికి మహేష్ బాబు .. ‘బ్రహ్మోత్సవం’ సినిమాకికి గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బానే ఉంటుంది మరి.  

More Related Stories