English   

కరోనాపై కొత్త సినిమా.... ఫస్ట్ లుక్ రిలీజ్

21 days
2020-04-16 14:35:13

అగ్గిపుల్లా, సబ్బు బిళ్ళా, కుక్క పిల్ల కాదేదీ కవితకి అనర్హం అన్నాడో మహా కవి. దానినే మన సినిమావాళ్ళు తమకు తాము అన్వయించుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా నేపధ్యంలో సగం ప్రపంచం లాక్ డౌన్ లోకి వెళ్ళింది. ఎక్కడో కొన్ని దేశాలు మాత్రమె వైరస్ సోకగా కొన్ని దేశాలు ఏమో ఇంకా లైట్ తీసుకుంటున్నాయి. అయితే కరోనా మీద సినిమాలు రావచ్చని మనోళ్ళు ముందే ఊహించారు. ఏ వర్మ లాంటి డైరెక్టరో ఒక సినిమా అనౌన్స్ చేయక పోతాడా అని ఎదురు చూసారు. అనుకున్నట్టుగానే దాని మీద సినిమా అనౌన్స్ చేశారు. కాకపోతే కరోనా మీద కాదు కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ మీద. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు. దానిక్ ‘21డేస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

లాక్‌డౌన్‌ రోజుల్లో జరిగిన విషయాల ఇతివృత్తంగా దీన్ని రూపొందించనున్నారు. ఎంబీఆర్‌ ఫిలిమ్స్‌ బ్యానర్ మీద విజయ్‌ భాస్కర్‌ దర్శక నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఏకంగా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనుందని అంటున్నారు. ఇక ఇప్పటికే ఆన్‌లైన్‌ లో నటీనటుల ఎంపిక కూడా చేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఇది ఒక షెడ్యూల్ లోనే షూట్ పూర్తి చేసి రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. అందులో నిజం ఎంత ఉందొ తెలియదు కానీ ఇలాంటి వైరస్ నేపధ్యంలో మలయాళంలో అదే టైటిల్ తో సినిమా వచ్చింది. అయితే అది నిఫా వైరస్ గుఇంచి తీసిన సినిమా కావడం గమనార్హం.

More Related Stories