English   

పవన్ సినిమాలో గోవా బ్యూటీ...పన్నెండేళ్ళ తర్వాత

Ileana D Cruz
2020-04-16 14:56:51

ఇక సినిమాలే చేయను- నా జీవితం ప్రజలకి అంకితం అని ఎన్నికల సమయంలో చెప్పి తన ఫ్యాన్స్ ని బాధలోకి నెట్టేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏకంగా వరుసగా మూడు నాలుగు సినిమాలు ఒప్పుకుని తన అభిమానులకే కాక సినీ ప్రియులకు కూడా షాకిచ్చారు. ఆయన రీఎంట్రీ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకోగా వేసవి కానుకగా మే 15న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనా దెబ్బకు ఆ ప్లాన్ అంతా పాడయింది కూడా అది వేరే విషయం. ఈ సినిమాలో అంజలి, నివేత థామస్, మల్లేశం హీరోయిన్ అనన్యలు  నటిస్తున్నారు. అయితే వకీల్ సాబ్ సినిమా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లో పవన్ కళ్యాణ్ భార్య పాత్రకి శృతి హాసన్ అని ప్రచారం జరిగింది.  అయితే ఆ విషయం మీద శ్రుతి క్లారిటీ ఇచ్చేసింది. ఆమె నటించడం లేదని. అయితే పవన్ భార్యగా ఇలియానాను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్టుగా ప్రచారం అయింది. 

ఇలియానా గతంలో ‘జల్సా’ చిత్రంలో పవన్‌తో జోడీ కట్టగా ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. నిజానికి ఇంత‌కు ముందే ఇలియానా న‌టిస్తుంద‌ని ప్రచారం జ‌రిగింది కానీ అది కన్ఫాం కాలేదు. తాజాగా మ‌రోసారి ఇలియానా పేరు తెర‌ మీదకి వ‌చ్చింది. నిర్మాత దిల్ రాజు ఇటీవ‌లే ఇలియానాని సంప్రదించ‌న‌ట్టుగా చెబుతున్నారు. ఇది నిజమయితే 12 సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్, ఇలియానా జంటగా నటించినట్టు అవుతుంది. క‌రోనా కార‌ణంగా ‘వ‌కీల్ సాబ్‌’ ముందు అనుకున్నట్టు మే 15న‌ కాకుండా.. ఆగ‌స్టు 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని ద‌ర్శక‌నిర్మాత‌లు భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బోని కపూర్ సమర్పిస్తున్నారు.  

More Related Stories