English   

లూసీఫర్ రీమేక్ సుజీత్‌కు రావడం వెనక అంత పెద్ద కథ ఉందా.. 

sujeeth
2020-04-16 17:02:26

లూసీఫర్ తెలుగు రీమేక్ దర్శకుడు ఎవరో తెలిసిపోయింది. ఇన్ని రోజులు ఉన్న సస్పెన్స్ ను ఇప్పుడు చిరంజీవి తీర్చేసాడు. ఈ సినిమాను తెలుగులో సుజీత్ తెరకెక్కిస్తాడని చెప్పేసాడు చిరు. తెలుగులో ఈ సినిమా కథను మార్చేస్తున్నాడు కూడా ఈయన. ఇప్పటికే వీడియో కాల్స్ చేసుకుని సినిమాను మార్చే పనిలో బిజీగా ఉన్నారు చిరంజీవి, సుజీత్. రామ్ చరణ్ చెప్పాడనే సుజీత్ కు ఈ ఆఫర్ ఇచ్చాడు చిరంజీవి. 

అయితే రామ్ చరణ్ ను అలా చేయమని చెప్పిన వాళ్లు మరొకరు ఉన్నారు. వాళ్లే యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్. ఎందుకో తెలియదు కానీ సుజీత్ కు ఈ నిర్మాతలు బాగా కనెక్ట్ అయిపోయారు. రన్ రాజా రన్ తో పాటు సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమా చేసారు. 30 ఏళ్లు కూడా లేని సుజీత్ ను నమ్మి 300 కోట్లు పెట్టి సాహో చేసారు యూవీ క్రియేషన్స్. ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అవడంలో సుజీత్ అనుభవ రాహిత్యం కనిపిస్తుంది. అందుకే అప్పట్నుంచి మరో నిర్మాత ఈయనకు అవకాశం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఈయనకు ఎలాగైనా మరో సినిమా ఇప్పించాలని యూవీ క్రియేషన్స్ భారీగానే ప్రయత్నించి సఫలం కూడా అయిపోయింది. 

రామ్ చరణ్ ను బతిమాలో బామాలో తెలియదు కానీ చిరంజీవితో సినిమా అవకాశం వచ్చేలా చేసారు. కొణిదెల ప్రొడక్షన్ లో సుజిత్ కు సినిమా అవకాశం ఇప్పించాలని చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. అందుకే లూసీఫర్ రీమేక్ లిస్టులో వినాయక్, వంశీ పైడిపల్లి, బాబీ లాంటి వాళ్లను దాటుకుని సుజీత్ ముందు నిలిచాడు. లూసిఫర్ లాంటి సబ్జెక్ట్ ను ఈ దర్శకుడు హ్యాండిల్ చేయలేడని కొందరు చెబుతున్న మాట.. దాంతో పాటు చిరంజీవి లాంటి మెగాస్టార్ ను హ్యాండిల్ చేయడం చిన్న విషయం కాదు. మరి చూడాలిక ఏం జరుగుతుందో..?

More Related Stories