English   

లాక్ డౌన్‌లో కొత్త జాబ్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి..

Chiranjeevi
2020-04-16 17:12:30

మెగాస్టార్ చిరంజీవి ఏంటి.. కొత్త ఉద్యోగం చేయడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే చేస్తున్నాడు చిరు. సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగా జోరు తట్టుకోవడం ఎవరి తరం కావడం లేదు. కొత్తగా వచ్చాననే ఉత్సాహమో ఏమో కానీ ప్రతీ విషయం కూడా అభిమానులతో పంచుకుంటున్నాడు మెగాస్టార్. 10 రోజుల నుంచి సోషల్ మీడియాను మోత మోగించేస్తున్నాడు చిరు. ప్రతీ చిన్న విషయం కూడా ఫ్యాన్స్ కు చెప్పేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. పొద్దున్నే లేవగానే తన ఇంట్లో ఉన్న మొక్కలకు నీళ్లు పడుతున్నాడు చిరంజీవి. 

ఇప్పుడు ఇంటిని శుభ్రం చేస్తున్నాడు. ఇదే పని చేస్తూ సోషల్ మీడియాలో వీడియో కూడా పోస్ట్ చేసాడు ఈయన. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కావడంతో పని వాళ్ళు కూడా ఎవరూ లేరు. అందుకే అందర్నీ ఇంటికి పంపేసి.. తన పనులు తానే చేసుకుంటున్నాడు చిరంజీవి. మొక్కే కదా వదిలేస్తే అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు చిరంజీవి. తనకు ఇంక ఈ లాక్ డౌన్ రోజులు ఇదే ఉద్యోగం అంటూ చెప్పాడు ఈయన. ఇంట్లో వాళ్లతో సమయం గడపడం.. మనవళ్లు మనవరాళ్లతో ఆడుకోవడం.. మధ్యలో ఇలా చెట్టకు నీళ్లు పట్టడంతో రోజు గడిచిపోతుందంటున్నాడు చిరంజీవి. ప్రస్తుతం ఈయన కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నాడు. 

More Related Stories