English   

కరోనా పూర్తిగా చైనా కుట్ర.. నిఖిల్ సంచలన ట్వీట్..

coronavirus
2020-04-16 19:59:27

కుర్ర హీరో నిఖిల్ కేవలం సినిమాలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటాడు. అంతేకాదు కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్తూనే ఉంటాడు. ఇప్పుడు ప్రపంచంతో ఆడుకుంటున్న కరోనా వైరస్ గురించి కొన్ని విషయాలు ట్వీట్ చేసాడు ఈయన. ముఖ్యంగా ఈ వైరస్ చైనా నుంచి వచ్చిందంటే కొందరు ఇప్పటికీ నమ్మడం లేదు. కానీ ఇది అక్కడ్నుంచే వచ్చింది అంటూ కొన్ని సాక్ష్యాలు కూడా తీసుకొచ్చాడు నిఖిల్. ఇదే ట్వీట్ చేసాడు కూడా. ఇదంతా చైనా కుట్రలో భాగమే అంటున్నాడు ఈయన. దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయంటున్నాడు నిఖిల్. ఈ వైరస్ తొలిసారి చైనాలోని ఊహాన్ లో వచ్చింది.. దాంతో జనవరి నుంచి వుహాన్ నగరం చైనాలోని ఇతర ప్రాంతాలకు రవాణా నిలిపేసింది. కానీ వుహాన్ నగరం నుంచి ప్రపంచ దేశాలకు ఫ్లైట్స్ మాత్రం నడిపింది..

అసలు చైనా ఇలా ఎందుకు చేసింది అని నిఖిల్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఒకవేళ కరోనా అక్కడే అరికట్టాలనుకున్నపుడు వూహాన్ లోనే పూర్తిగా నయం చేస్తే అయిపోయేది కదా.. లేదంటే చైనా లోని వుహాన్ నగరం నుంచి ఇతర ప్రదేశాలకు ఫ్లైట్స్ ఎందుకు ఆపేసారు.. ఓ ల్యాబ్ లో కరోనా వైరస్ రూపొందిందని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలంటున్నాడు నిఖిల్. చైనా కావాలనే ఉద్దేశ పూర్వకంగా ఈ ప్రాణాంతక వైరస్ ని ప్రపంచంపైకి వదిలిందని ఆరోపిస్తున్నాడు నిఖిల్. ఈయన వాదనలో నిజం కూడా లేకపోలేదు. ఈయన పెళ్లి కూడా కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. ఆయన తన ప్రేయసి డాక్టర్ పల్లవిని ఈ నెలలో వివాహం చేసుకోవాల్సి వుంది. నిఖిల్ ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమాలో నటిస్తున్నాడు.

More Related Stories