English   

కొరటాల శివ సీక్రెట్ బయటపెట్టిన మెగాస్టార్ చిరంజీవి..

chiru
2020-04-17 07:56:49

అసలు చిరంజీవికి ఈ మధ్య రహస్యాలు అసలు ఆగడంలేదు. ఎక్కడపడితే అక్కడ ఆయన బయట నోరు జారుతున్నాడు. ఇప్పుడు కొరటాల శివ జీవితం గురించి ఒక నిజం బయట పెట్టాడు చిరంజీవి. అది విన్న తర్వాత ఈ దర్శకుడిపై గౌరవం పదిరెట్లు కాదు వంద రెట్లు పెరుగుతుంది. కొరటాల శివ తన ప్రతి సినిమాలో వినోదంతో పాటు సందేశం కూడా ఇస్తూ ఉంటాడు. సినిమాను కూడా ఒక బాధ్యత కలిగిన సామాజిక మాధ్యమంగా ఆయన భావిస్తుంటాడు. తాను చేసే ప్రతి సినిమా నుంచి మంచి నేర్చుకోకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకూడదని నమ్ముతాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో వినోదంతో పాటు అద్భుతమైన మెసేజ్ కూడా ఉంది. ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న ఆచార్య సినిమాలో కూడా తన హీరోని పర్యావరణ పరిరక్షకుడిగా కూడా చూపిస్తున్నాడు.

ఇదిలా ఉంటే కొరటాల శివ పెళ్లి చేసుకుని చాలా సంవత్సరాలు అవుతుంది. అయితే ఇప్పటివరకూ ఆయనకు పిల్లలు లేరు. ఈ విషయంపై నెటిజన్లు కూడా చాలాసార్లు ప్రశ్న అడిగారు. ఇప్పుడు దీనికి చిరంజీవి నుంచి సమాధానం వచ్చింది. తన జీవితంలో కొరటాల శివ లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఇప్పటి వరకు చూడలేదు అని చెప్పాడు ఈయన. దానికి కారణం కూడా చెప్పాడు. ఇప్పటికీ కొరటాల శివ.. ఆయన భార్య తాము సంపాదిస్తున్న మొత్తంలో సగం సమాజం కోసం ఖర్చు పెడుతున్నారని షాకింగ్ నిజం చెప్పాడు చిరంజీవి. దాంతో పాటు వాళ్ళు పిల్లలు కనకపోవడానికి కారణం కూడా సమాజ సేవ కోసమే అని మరో నిజం బయటపెట్టాడు చిరంజీవి. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని.. వాళ్లని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటున్నాడు మెగాస్టార్

More Related Stories