English   

బిగ్ బాస్ బ్యూటీతో రాహుల్ లిప్ లాక్...నేను సచ్చిపోతా

Rahul Sipligunj
2020-04-17 12:40:41

బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ ముందు జనానికి పెద్దగా తెలియదు. అలాంటిది అక్కడ టైటిల్ కొట్టడంతో బిజీ అయిపోయాడు. వరసగా పాటలు పాడుతూ కాసిన్ని రాళ్ళు వెనకేసుకుంటూన్నాడు. అన్నట్టు మనోడికి ఏకంగా కృష్ణవంశీ దర్శకత్వంలోనే నటించే ఛాన్స్ సంపాదించారు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఆయన ఇంట్లోనే ఉన్నా కానీ అప్పట్లో మనోడు చేసిన మరో ఘన కార్యం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే బిగ్ బాస్ భామతో లిప్ లాక్. ఇలా అనగానే పున్నూ అని ఫిక్స్ అయిపోకండి. రెండో సీజన్ కంటెస్టెంట్ నందిని రాయ్ గుర్తుంది కదా.. ఆరేళ్ల కింద ఈమెతో కలిసి ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేసాడు రాహుల్. అందులో భాగంగానే లిప్ లాక్ కూడా లాగేశాడు. 

అయితే అప్పుడెప్పుడో నందినీ రాయ్‌తో ఫుల్ రొమాన్స్ చేస్తున్న వీడియోను రాహుల్ తన ఇన్‌స్టాగ్రమ్‌లో పంచుకున్నాడు. ఈ వీడియోలో ఇద్దరు లిప్ టు లిప్ కిస్ ఇస్తున్న సీన్ చూసుకుని నవ్వుకున్న వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియోను చూసిన మరో కంటేస్టంట్ అషూ రెడ్డి చేసిన కామెంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 'వావ్ ఇది నేను చూడలే' అని కామెంట్ చేసింది. దీనికి రాహుల్.. 'అబ్బో ఇక నేను చచ్చిపోతా' అంటూ రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. దీనికి మళ్లీ స్పందించిన అషూ.. 'మినిమమ్ ఉంటాయ్ కదా నీ వీడియోస్‌లో' అంటూ స్మైలీ ఎమోజీ జత చేసింది. ఇక ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ లిప్ లాక్ సీన్ వైరల్ అవుతుంది.

More Related Stories