English   

బర్త్ డే కి డబుల్ ట్రీట్ సిద్దం చేస్తోన్న ఎన్టీఆర్

NTR
2020-04-17 12:48:09

ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు కధానాయకులుగా నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. డీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి మొన్ననే టైటిల్ అలాగా రామ్ చరణ్ కి సంబందిన్చిన  చిన్న ఏవీ ఒకటి రిలీజ్ చేశారు. దానికి మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చేసింది. ఆయన పుట్టినరోజు దగ్గరకు రావడంతో ఆయనకు సంబంధించి ఏదో ఒక ట్రీట్ అభిమానులకి తప్పకుండా ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. 

అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్‌ తన 30వ సినిమాని త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ప్రారంభించనున్నాడు. ఆ సినిమా మొదలు పెట్టడానికి ఇంకా సమయం ఉన్నా మే 20న తన పుట్టినరోజును పురస్కరించుకోని ఈ రెండు చిత్రాల నుంచి అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు. 

చరణ్‌ పుట్టినరోజు కానుకగా ‘భీమ్‌ ఫర్‌ అల్లూరి’ పేరుతో చరణ్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ఇప్పుడు తారక్‌ జన్మదిన కానుకగా ‘అల్లూరి ఫర్‌ భీమ్‌’ పేరుతో ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నారని చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అంతా సెట్ చేసినట్టుగా చెబుతున్నారు. డబ్బింగ్‌ పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఇక అదే రోజు ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ చిత్రానికి సంబంధించి టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేసే అవకాశమున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత ఉందొ తెలియదు కానీ అదే నిజమయితే మాత్రం రచ్చ రచ్చె కదా..

More Related Stories