English   

విజయ్ దేవరకొండను బాక్సింగ్ దెబ్బ కొట్టిన వరుణ్ తేజ్.. 

Vijay devarakonda
2020-04-17 15:09:11

విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఈయనకు కానీ అర్జంటుగా ఇప్పుడు ఓ హిట్ రాకపోతే చాలా కష్టం. తర్వాత మంచి దర్శకులే లైన్ లో ఉన్నా కూడా పడిపోతున్న మార్కెట్ నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా పూరీ జగన్నాథ్ తో చేస్తున్న ఫైటర్ సినిమా హిట్ కొట్టాల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా ఆగిపోయింది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ కూడా పూర్తి చేసాడు పూరీ. అయితే షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత దీన్ని పాన్ ఇండియన్ సినిమాగా మార్చాలని నిర్ణయించుకున్నాడు పూరీ జగన్నాథ్. దాంతో అనుకున్న దానికంటే కూడా ఫైటర్ సినిమా ఆలస్యంగా విడుదల కానుంది. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో వస్తుంది. ఇందులో పాత్ర కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు విజయ్. 

ఇదిలా ఉంటే బాక్సింగ్ నేపథ్యం తెలుగు ఇండస్ట్రీకి బాగానే కలిసొచ్చింది. ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమా కూడా బాక్సింగ్ నేపథ్యంలోనే వస్తుంది. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫైటర్ పాన్ ఇండియా కావడంతో 2021 విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు పూరీ. ఇదిలా ఉంటే ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమా మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నాడు కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి. ఈ సినిమా షూటింగ్ కూడా వైజాగ్ లో మొదలైపోయింది. అయితే కొన్ని రోజులుగా ఆగిపోయింది. వరస విజయాలతో జోరు మీదున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో మరో విజయం అందుకుంటానని ధీమాగా చెబుతున్నాడు. మరోవైపు విజయ్ కూడా బాక్సింగ్ నేపథ్యంలోనే వస్తున్నాడు. ఇందులో వరుణ్ తేజ్ ముందు వస్తుండటంతో కచ్చితంగా ఈయన సినిమాతో విజయ్ కు సమస్యలు వచ్చేలా కనిపిస్తున్నాయిప్పుడు. మరి దీనిపై ఫైటర్ టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలిక. 

More Related Stories