ప్రభాస్ పెళ్లి ఇండియాలో కాదంట.. ఎక్కడో తెలుసా..

తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ నడుస్తూనే ఉంటుంది. సీరియల్ కంటే సీరియస్ గా సాగుతుంది ప్రభాస్ పెళ్లి డ్రామా. అవును అనరు.. కాదనరు కానీ లాగుతూనే ఉంటారు. ప్రభాస్ ఏమో పెళ్లి ఎప్పుడు అంటే ఏమో అంటాడు.. కృష్ణంరాజు మాత్రం ఇదిగో ఇప్పుడే అంటాడు. తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా మారిపోయాడు ప్రభాస్. వయసు 40 వచ్చినా ఇంకా పెళ్లికి దూరంగానే ఉన్నాడు ఈ హీరో. బాహుబలి తర్వాత ఈయన పెళ్లి పీటలు ఎక్కుతాడంటూ వార్తలు బాగానే వచ్చాయి. కానీ అది జరగలేదు. ఇప్పుడు బాహుబలి వచ్చి రెండేళ్లు దాటిపోయింది. సాహో కూడా విడుదలై ఏడాది కావొస్తుంది. ఇంకా పెళ్లికి నో అంటూనే ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతానికి సినిమాలపైనే తన దృష్టి ఉందని.. ఆ తర్వాతే ఏదైనా అంటున్నాడు ఈ హీరో. అయితే ఈ సినిమా తర్వాత రాధాకృష్ణ సినిమా కూడా సిద్ధంగా ఉంది. ఇది పూర్తైన తర్వాత పెళ్లి అంటున్నాడు ప్రభాస్.
అమెరికన్ అమ్మాయితో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. అక్కడే సెటిల్ అయిన కుటుంబంతో కృష్ణంరాజు వియ్యం అందుకోబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. రాధాకృష్ణ తర్వాత ఈ పెళ్లి ముచ్చట కూడా చెబుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ కచ్చితంగా ఆ రోజు ఏదో ఒకటి తేల్చడానికి పెద్దాయన సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రభాస్ సమాధానమిస్తూ.. తన వ్యక్తిగత విషయాలు బయట చెప్పడం తనకు ఇష్టం ఉండదని చెప్పాడు. చాలామంది తనకు ఎఫైర్లు ఉన్నాయని.. పెళ్లి ఎప్పుడు అవుతుందని అడుగుతున్నారని.. కానీ అది తన పర్సనల్ అని.. అది బయట చెప్పడం అనేది తనకు ఇష్టం ఉండదని.. అది మీడియా వారే అర్థం చేసుకోవాలన్నాడు ప్రభాస్. ఏదేమైనా ఈయన ఎప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా ఇండియాలో కాకుండా విదేశాల్లో చేసుకోవాలని చూస్తున్నాడు. అక్కడైతే ప్రశాంతంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనేది ప్రభాస్ ప్లాన్.