English   

లాక్ డౌన్ సమయంలోనూ పెళ్లి చేసుకున్న నిఖిల్

nikil
2020-04-17 19:08:55

దేశంలోనే కరోనాకు కట్టడికి కఠిన నిర్ణయాలు అమలవుతున్నా సరే అదుపులోకి రావడం లేదు. జనసాంధ్రత కలిగిన ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చెయ్యడం, లాక్ డౌన్ కు ప్రభుత్వం ఆదేశించడం కాస్త ఉపశమనం ఇస్తున్నా భవిష్యత్ లో కరోనా వైరస్ ఏలాంటి ప్రభావం చూపిస్తుందని దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకలో మాత్రం ఈ వైరస్ గట్టిగానే ఉంది. ఇప్పటి వరకూ కర్ణాటకలో 353 పాజిటివ్ కేసులు నమోదు కాగా 13 మంది మృతి చెందారు. ఇలాంటి విపత్కర పరిస్ధితిలో ఆదర్శంగా నిలవాల్సిన రాజకీయ నేతలు ఇష్టారీతిన వ్యవహరించడం కలకలం రేపుతోంది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న క్లిష్ట సమయంలో దేశ మాజీ ప్రధాని మనవడి వివాహం జరగడం చర్చనీయాంశమైంది. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌ వివాహం జరిగింది.

దీనికి బెంగళూరు సమీపంలోని రామనగరలో ఉన్న వారి ఫాంహౌజ్‌ వేదికైంది. ఈ వివాహానికి బయటివారు ఎవ్వరూ హాజరుకానప్పటికీ ఇరు కుటుంబసభ్యుల నడుమే ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాహానికి హాజరైన వారు మాత్రం లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటించలేదని బయటకొచ్చిన ఫోటోల ద్వారా అర్ధం అవుతోంది. కుమారస్వామి తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ, వివాహం వేడుకుల నేపద్యంలో నిబందనలకు అనుగుణంగా జరుగుతాయని, సామాజిక దూరాన్ని పాటిస్తామని చెప్పారు. కానీ వివాహం జరిగే ప్రాంతాల్లో బారికేడ్లు లాంటివి ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది.వివాహ వేడుకలు మాత్రం జబర్దస్త్ గానే జరిగాయని ఈ వీడియోల ద్వారా తెలుస్తోంది.

 

More Related Stories