English   

కరోనా పై గబ్బర్ సింగ్ గ్యాంగ్ ర్యాప్..పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే

pk
2020-04-17 19:26:20

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. ఈ వైరస్ నివారణ కోసం కేంద్రం 21 రోజుల పాటు మొదటిసారి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించగా ఆయినా  కేసులు ఇంకా తగ్గకపోవడంతో మరో 19 రోజులు లాక్‌డౌన్ ని పొడిగించారు. ఇప్పటికే కరోనా మీద పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమవంతు సాయం చేస్తున్నా చాలా మందికి తిండి పెడుతూ బయటి వారు కూడా అండగా నిలబడుతున్నారు. ఇక సినీ నటులు కూడా తిండి లేని వారికీ అండగా నిలుస్తున్నారు. అలాగే మరో పక్క కరోనా మహామ్మారిపై అవగాహాన కల్పిస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ తరపున ఓ ర్యాప్ సాంగ్ బయటకు వచ్చింది. గబ్బర్ సింగ్ సినిమాలో యాక్ట్ చేసిన నటులు ఈ సాంగ్ పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి మ్యూజిక్ ఇచ్చిన ఈ పాటను ప్రియాంక రాశారు. మేఘరాజ్ ఈ పాటను పాడారు. ఈ పాట పాడిన వాళ్లకు అందులో కనిపించిన వారికీ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. "
కరోనా పై ర్యాప్ సాంగ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్న "గబ్బర్ సింగ్" సినిమా నటులు సాయి బాబా, రమేష్, ప్రవీణ్, రాజశేఖర్, శంకర్, శ్రీకాంత్, ఉదయ్ కుమార్, సోమరాజ్, చంద్రశేఖర్, నరసింహ రెడ్డి గార్లకు, సింగర్ "మేఘా రాజ్", ఎడిటర్ "వేణు" మ్యూజిక్ డైరెక్టర్ "శ్రీ కోటి" గీత రచయిత "ప్రియాంక" గార్లకు, మరియు ఇతర సహాయక బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటూ పాటను షేర్ చేశారు పవన్ కళ్యాణ్.

 

More Related Stories