English   

యంగ్ టైగర్ బర్త్ డేకు డబుల్ ట్రీట్.. రాజమౌళితో పాటు..

ntr
2020-04-17 20:22:37

మొన్న రామ్ చరణ్ బర్త్ డేకు రాజమౌళి ఇచ్చిన గిఫ్ట్ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. మరో నెల రోజుల్లో వాళ్లు వేచి చూస్తున్న రోజు రానే వస్తుంది. మే 20న తారక్ పుట్టిన రోజు. ఆ రోజు రాజమౌళి ఎలాంటి ట్రీట్ ఇస్తాడో చూడాలని జూనియర్ ఫ్యాన్స్ అంతా వేచి చూస్తున్నారు. వాళ్లు చూస్తున్న దానికంటే పెద్ద బహుమతినే ఇప్పుడు రాజమౌళి సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర రామ్ చరణ్ పోషిస్తుంటే.. అడవిబిడ్డల తరఫున పోరాడిన కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తున్నాడు తారక్. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా RRR స్పెషల్ టీజర్ రిలీజ్ చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. చరణ్ టీజర్ కంటే మరింత పవర్ ఫుల్ గా ఉండే టీజర్ రెడీ అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఓ వైపు రాజమౌళితో పాటు మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ట్రీట్ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. తారక్ బర్త్ డే రోజే తన సినిమా టైటిల్ అనౌన్స్ చేయాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. అరవింద సమేత తర్వాత మరోసారి ఈ ఇద్దరూ కలిసి పని చేస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ లాక్ డౌన్ తర్వాత జూన్ నుంచి మొదలు కానుందని తెలుస్తుంది. RRR తో పాటే త్రివిక్రమ్ టైటిల్ కూడా వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అంతకంటే కావాల్సిందేం ఉంటుంది చెప్పండి..?

 

More Related Stories