English   

అల్లు అర్జున్ సొంత కుంపటి పెట్టుకోవాలని ఫిక్సయ్యాడా..?

alluarjun
2020-04-18 07:07:49

ఏమో ఇప్పుడు బన్నీ మాటలు చూస్తుంటే మాత్రం ఇదే అనిపిస్తుంది. ఈయనకు మెగా కుటుంబంతో.. ఆ అభిమానంతో పెద్దగా పనిలేనట్లే కనిపిస్తుంది. పూర్తిగా సొంత కుంపటి పెట్టుకోవాలని ఫిక్సైపోయినట్లు అర్థమవుతుంది. ఆ మధ్య అల వైకుంఠపురములో మ్యూజకల్ నైట్ లో బన్నీ మాట్లాడిన మాటలు ఇప్పటికీ అందరికీ షాక్ ఇస్తున్నాయి. మెగా ఫ్యామిలీ ఈయన్ని దూరం పెట్టిందా.. లేదంటే కావాలనే ఈయనే దూరం అవుతున్నాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గతంలో పవన్ గురించి అడక్కపోయినా మాట్లాడిన బన్నీ.. ఇప్పుడు మాత్రం ఆయన గురించి అంటేనే పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ మధ్య ఓ వేడుకలో తాను పవన్ పెద్ద అభిమానిని అని.. ఆయన లేకపోతే తాను లేనని చెప్పిన బన్నీ.. ఇప్పుడు మాత్రం అసలు పవన్ ఎవరు అనే స్థాయిలో మాట్లాడాడు. ఇవన్నీ దేనికి సంకేతం అనేది అర్థం కావడం లేదు. మెగా ఫ్యాన్స్అని చెప్పే బన్నీ.. ఈ సారి మాత్రం నా ఫ్యాన్స్ అంటున్నాడు. ఆర్మీ అంటున్నాడు..

తన పేరు పచ్చబొట్టు వేయించుకున్నారని చెప్పాడు. ఇవన్నీ చూస్తుంటే అసలు తనకు మెగా కుటుంబంతో ఎలాంటి సంబంధాలు అవసరం లేదు.. పూర్తిగా సొంత కుంపటి పెట్టుకోవాలనేది మంచి ఆలోచన అన్నట్లుంది బన్నీ పరిస్థితి. ఇంకా చెప్పాలంటే చిరంజీవితో కూడా పెద్దగా పనిలేనట్లే మాట్లాడేసాడు. మొన్నటికి మొన్న చిరంజీవి ఇంటి నుంచి స్టార్స్ అంతా కరోనాపై పోరాటం కోసం ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. అందులో కూడా అల్లు అర్జున్ మిస్ అయ్యాడు. ఈ మధ్య కొన్ని ఈవెంట్స్ కు బన్నీ మిస్ అవుతూ వస్తున్నాడు. తనకు చిరంజీవి అంటే ప్రాణం అన్నాడు కానీ మెగా ఫ్యాన్స్ కావాలనే మాటే బన్నీ నోటి నుంచి రావట్లేదు ఇప్పుడు. తనకు తన ఫ్యాన్స్ ఉన్నారు చాల్లే అన్నట్లుగా మాట్లాడేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే మెగా కుటుంబం నుంచి బన్నీ దూరం అవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే పరిస్థితేంటో మరి..?

More Related Stories