నిఖిల్ పెళ్లిపై బాలయ్య హీరోయిన్ సంచలన వాఖ్యలు

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు, హీరో నిఖిల్ పెళ్లిపై బాలీవుడ్ కథానాయిక రవీనా టాండన్ విమర్శలు గుప్పించారు. లాక్డౌన్ వేళ పెళ్లి చేయడమేంటని ప్రశ్నించారు. పేదలు ఆకలితో అలమటిస్తూ నిబంధనలు పాటిస్తున్నవేళ.. ధనికులు మాత్రం వాటిని ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. వీళ్లకు సామాన్యుల కష్టాలు తెలియట్లేదన్నారు. సుమారు 60 మంది ఈ పెళ్లికి హాజరైనట్లు కుమారస్వామి కుటుంబం తెలిపింది. అయితే లాక్డౌన్ ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని కర్నాటక ప్రభుత్వం ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. మాస్క్లు లేకుండా, కనీస దూరం పాటించకుండా పెళ్లి జరిపించిన పోటోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఓ వైపు లైక్డౌన్ కొనసాగుతుండగానే కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ పెళ్లి సన్నిహితుల మధ్య పూర్తయింది. కాంగ్రెస్ నేత, మాజి మంత్రి మంత్రి కృష్ణప్ప కుమార్తె రేవతిని నిఖిల్ వివాహమాడారు. బెంగళూరులో జరిగిన ఈ పెళ్లిలో ఎవరూ మాస్కులు ధరించకపోవడం.. భౌతికదూరం పాటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పెద్దఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. వీఐపీలకు లాక్డౌన్ నిబంధనలు వర్తించవా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.