English   

ఉపాసన కొత్త ఛాలెంజ్...ట్రై చేస్తారా ?

upsana
2020-04-18 08:13:28

సోషల్ మీడియాలో చాలెంజ్ లు ఎక్కువయ్యాయి. కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అందరూ ఇళ్ళకి పరిమితం కావడంతో సోషల్ మీడియాలోనే కాలం గడుపుతున్నారు. దీంతో కొన్ని చాలెంజ్ లు నడుస్తున్నాయి. అందులో సెలబ్రిటీల వరకూ ముఖ్యమైంది ఏంటంటే పిల్లో ఛాలెంజ్. అంటే ఒంటి మీద అబట్టలు ఏమీ లేకుండా ఒక దిండు అడ్డం పెట్టుకుని ఫోటోకి ఫోజులు ఇవ్వడమే. దీనిని ఆడవాళ్ళూ మగవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ చేసేస్తున్నారు. ఇక అలా చేస్తే కిక్కేముంది అనుకుందో ఏమో రామ్ చరణ్ భార్య ఉపాసన. కొత్తగా ఆలోచించింది. ఈ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ.. దానిపై అవగాహన కల్పించేందుకు పలువురు ముందుకొస్తున్నారు. రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కూడా చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పలువురు రోడ్లపై కాళ్ల మీద కూర్చుంటున్న విధానాన్ని ఉపాసన పంచుకున్నారు. ఇండియన్ టాయిలెట్‌ పొజిషన్‌లో పాదాలను పూర్తిగా నేలకు ఆనించి 5 నిమిషాలు కూర్చోగలరా అని ఆమె కోరారు. మే 3వ తేదీ వరకూ తాను వీలైనన్న ఎక్కువసార్లు అలా కూర్చోవాలనుకుంటున్నట్టు చెప్పారు. ఇలా కూర్చుంటే జరిగే ప్రయోజనాలను కూడా ఆమె వెల్లడించారు. వినాడానికి చూడడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నా ఇది కొంచెం ఆలోచించదగిన విషయమే. మీరూ ట్రై చేయండి మరి.

 

More Related Stories