English   

తెలుగు ఇండస్ట్రీకి ఇబ్బందే...సురేష్ బాబు సంచలనం

suresh babu
2020-04-18 12:31:46

కరోనా క్రైసిస్ తో సినిమా ఇండస్ట్రీ మీద కోలుకోలేని దెబ్బపడినట్టే కనిపిస్తోంది. రెండు వారాలు అనుకున్న లాక్ డౌన్ ఇప్పుడు  మరో ఇరువై రోజులకు పెరిగింది. దీంతో ఆడియన్స్ తో అనునిత్యం కళకళలాడే థియేటర్స్ నిర్మానూహ్యంగా మారిపోయాయి. ప్రేక్షకుల కిటకిటలతో సందడిగా ఉండే సినిమా హాళ్ళు, మాల్స్ వెలవెలబోతున్నాయి. కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో... ఎప్పుడు పరిస్థితి నార్మల్‌ స్టేజ్‌కు వస్తుందో తెలీని పరిస్థితి. వచ్చిన తర్వాత ఏం చేయాలన్న ప్లాన్‌లో సినిమా ఇండస్ట్రీ వుంది. కరోనాతో భయపడిపోయిన జనాలను మళ్లీ థియేటర్స్‌కు రప్పించడం ఎలా? సినిమాలను ఏ పద్ధతిలో రిలీజ్‌ చేయాలి. టిక్కెట్‌ రేట్లు తగ్గించాలా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇండియన్‌ సినీ ఇండస్ట్రీ ముందు ఉన్నాయి. 

కరోన తగ్గు ముఖం పట్టి ఒక వేళ  లాక్ డౌన్ మే నెలలో ఎత్తేసినా జనాన్ని ఇప్పట్లో గుంపులుగా అనుమతించే పరిస్థితి లేదు కనుక జూన్ లేదా జులైకి థియేటర్స్ మళ్ళీ రెడీ అయ్యే అవకాశం ఉంది. రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాల నిర్మాతలైతే ఎంత త్వరగా మళ్ళీ యథాతథ స్థితి వచ్చేస్తే అంత బాగుంటుందని దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు. అయితే సీనియర్ నిర్మాత సురేష్ బాబు ఈ ఏడాది చివరి వరకు థియేటర్లు తెరుచుకోక పోవచ్చెమోనని అనుమానం వ్యక్తం చేసి నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాడు. సురేష్ బాబు లాంటి కాలిక్యులేటేడ్ పర్సన్ ఈ మాట మాట్లాడాడు అంటే నిజమేనని భయపడుతున్నారు. నిజమేనేమో పాపం !

More Related Stories