English   

మా సినిమా థియేటర్ లోనే చూడాలి...ఫోన్లలో కాదు 

Indraganti
2020-04-18 12:51:37

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ వి. దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద తెరక్కుతున్న ఈ సినిమాకి తీసేవి తక్కువ సినిమాలే అయినా విభిన్న చిత్రాలను  తెరకెక్కిస్స్తారన్న  పేరున్న మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే నాని ఇందులో నెగటివ్ రోల్ చేస్తున్నాడని ముందు నుండీ చెబుతున్నారు. అలా ఒకరకంగా ఈ సినిమా మీద భారీ అంచనలున్నాయి.  చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 25న ఉగాది రోజున ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.  అయితే కరోనా లాక్ డౌన్ వలన ఆగిపోయింది. 

అయితే ఈ సినిమా కోసం ఆమేజాన్ ప్రైమ్ వాళ్లు దిల్ రాజుకు మంచి రేట్ అఫర్ చేశారట.. ఈ సినిమా థియేటర్ లో కాకుండా మొత్తానికి తమకి ఇచ్చేస్తే తాము 40 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారట. అయితే అమౌంట్ టెంప్ట్ చేసేలా ఉన్నా ఇప్పుడు సినిమా అమ్మేస్తే తన థియేటర్స్ బిజినెస్ ఇబ్బందుల్లోకి వెళ్తుందనీ భావించి నో చెప్పినట్టు ప్రచారం జరిగింది.  ఇప్పుడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా అదే చెబుతున్నారట. ఈ సినిమాను థియేటర్ లోనే చూడాలని ఆయన అంటున్నారు. 

థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసమే ఈ సినిమా తీశానని ఇలా మొబైల్స్ లోనో టీవీలోనో చూసేస్తే కిక్కేం ఉంటుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమా కోసం  అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్స్ దీనికి పనిచేశారని అంటున్న ఆయన ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూస్తేనే మజా వస్తుందని అంటున్నారు. అలాగే ఓటీటీకి తాను వ్యతిరేకం కాదంటూనే ఫస్ట్ ప్రయారిటీ బిగ్ స్క్రీన్ కేనని అంటున్నారు. సో రెండు నెలలు అయినా మూడు నెలలు అయినా థియేటర్ లోనే వస్తాం కానీ ఇలా రిలీజ్ చేయమని క్లారిటీ ఇచ్చేశారు.

More Related Stories