English   

దిల్ రాజు టెన్షన్ తీర్చిన పవన్ కళ్యాణ్

dilraju
2020-04-18 19:22:46

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక మనదేశంలో లాక్ డౌన్ వలన సినీ ప్రముఖులు అయితే కొందరు రెస్ట్ తీసుకుంటుంటే మరి కొందరేమో ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతానికి ఒక సినిమా రిలీజ్ కి రెడీ చేసి, మరో సినిమాని రెండు మూడు నెలలలో రిలీజ్ చేయాలనుకున్న దిల్ రజు పరిస్థితి అలాంటిదే. అయితే ఈ పరిస్థితుల్లో ఆయనకు పవన్ కళ్యాణ్ నుండి భారీ హామీ లభించిందని అంటున్నారు. అసలు విష్యం ఏమిటంటే లాక్‌డౌన్ సమయంలో కూడా పవన్ కల్యాణ్ తన సినిమాల ప్రీ ప్రొడక్షన్ పనులు చేసేస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేశాక సెట్స్‌పైకి వెళ్లి వీలయినంత త్వరగా సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే తనతో ఒప్పుకున్నా వకీల్ సాబ్‌ కంటే క్రిష్ రూపొందించే విరూపాక్ష మీదే పవన్ ఎక్కువ ద్రుష్టి పెట్టినట్టు దిల్ రాజు భావించి టెన్షన్ పడుతున్నారట.

అయితే దిల్ రాజు బాధ అర్ధం చేసుకున్న పవన్ దిల్ రాజుకు స్పష్టమైన హామీ ఇచ్చారట. మొదట వకీల్ సాబ్ పూర్తయిన తరువాతనే  విరూపాక్ష జోలికి వెళతానని అనవసరమైన టెన్షన్స్ పెట్టుకోవద్దని అన్నారట. పరిస్థితిలు తారుమారు అయినందున కావాలన్రే వకీల్ సాబ్ కోసం పూర్తి సమయాన్ని వేచ్చిస్తానని, ఇంకా అవసరం అనుకుంటే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానని కూడా చెప్పారట. అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్‌పై ఓ పాటను షూట్ చేయాలని, ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కానందున లేట్ అయ్యిందని అంటున్నారు. 

More Related Stories