పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన కలర్స్ బ్యూటీ..

చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ స్వాతి.. కలర్స్ ప్రోగ్రామ్ తో క్రేజ్ తెచ్చుకుని కలర్స్ స్వాతిగా మారిపోయింది ఈమె. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి.. యాంకర్ గా.. నటిగా.. హీరోయిన్ గా అన్ని రకాల పాత్రల్లోనూ కనిపించింది స్వాతి. తెలుగు ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వచ్చి ఆ తర్వాత డేంజర్ సినిమాతో నటిగా మారింది ఈమె. 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే', 'అష్టా చెమ్మా', 'త్రిపుర', 'అప్పల్రాజు', 'స్వామిరారా', 'కార్తికేయ' తదితర చిత్రాల్లో నటించిన పాపులర్ హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు ఈమె పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. కొన్నేళ్లుగా తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసి అన్ని చోట్లా మంచి పేరు తెచ్చుకున్న స్వాతి.. ఏడాదిన్నర కింద కోరుకున్న వాడితో ఏడడుగులు నడిచింది. 2018, ఆగస్ట్ 30న తను ప్రేమించిన కేరళ కుర్రాడు వికాస్ ను పెళ్లి చేసుకుంది స్వాతి. హైదరాబాద్ లోనే ఎన్ డైమండ్ ఎన్ కన్వెన్షన్ లో వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది.
సెప్టెంబర్ 2న రిసెప్షన్ మాత్రం పెళ్ళికొడుకు ఊళ్లో అంటే కేరళలోని కొచ్చిలో జరిగింది కూడా. సేవ్ ది డేట్స్ అంటూ కొత్తగా పోస్టర్ కూడా అప్పట్లో విడుదల చేసింది ఈ భామ. తెలుగమ్మాయి కాస్తా కేరళ కోడలు అయిపోయింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగానే ఉంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే స్వాతి తన వ్యక్తిగత విషయాలని అభిమానులతో పంచుకుంటుంది. ఇందులో భాగంగానే తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియం నుంచి డిలీట్ చేసింది. దాంతో స్వాతి ఆ ఫోటోలను ఎందుకు డిలీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. తన వ్యక్తిగత జీవితాన్ని ఇంకా పర్సనల్ గా ఉంచుకోవడానికా లేదంటే ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనేది కూడా అర్థం కావడం లేదు. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా మొదలయ్యాయని ప్రచారం జరుగుతుంది. గతంలో శ్వేతా బసు ప్రసాద్, అమల పాల్, ఇలియానా, సనా ఖాన్ ఇలా చాలామంది హీరోయిన్లు ముందు సోషల్ మీడియాలో ఫోటోలను డిలీట్ చేసారు.. ఆ తర్వాత జీవితంలోంచి వాళ్లను కూడా డిలీట్ చేసారు. మరి దీనిపై స్వాతి ఏం చెబుతుందో చూడాలిక.