English   

పవన్ కళ్యాణ్‌తో ఆమెను కన్ఫర్మ్చ చేసుకోవచ్చేమో..

pk
2020-04-18 19:42:00

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తున్నాడు ఈయన. ఇంటి నుంచే డబ్బింగ్ చెబుతున్నాడు పవన్. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసిందని నిర్మాత దిల్ రాజు చెప్పాడు. రెండున్నర గంటల సినిమాలో రెండు గంటల సినిమా షూటింగ్ పూర్తైపోయిందని చెప్పాడు ఈయన. ఇంకా హీరోయిన్ పార్ట్ మాత్రమే మిగిలిపోయిందని.. అది కూడా లాక్ డౌన్ తర్వాత పూర్తి చేస్తామని చెబుతున్నాడు దిల్ రాజు. ఓ మై ఫ్రెండ్, ఎంసిఏ సినిమాల తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. పింక్ సినిమా కథను ఇక్కడి ఆడియన్స్ కోసం కాస్త మార్చారని మొన్నటికి మొన్న నాగబాబు కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తేలలేదు. పూజా హెగ్డే, ఇలియానా పేర్లు వినిపించినా కూడా కన్ఫర్మ్ కాలేదు. వకీల్ సాబ్ సినిమాలో హీరోయిన్ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుంది. అరగంట కూడా ఉండదు. అందుకే టాప్ హీరోయిన్లు నో చెబుతున్నారు. ఇప్పుడు గబ్బర్ సింగ్ శృతి హాసన్ ఇందులో నటించబోతుందని నిర్మాత దిల్ రాజు కన్ఫర్మ్ చేసాడు. లాక్ డౌన్ పరిస్థితులు చక్కబడ్డాక శృతి హాసన్ డేట్స్ మళ్లీ అడ్జస్ట్ చేసుకుని మిగిలిన సీన్స్ తెరకెక్కిస్తామని చెప్పాడు దిల్ రాజు. తమ సినిమాలో శృతి లేదని వస్తున్న వార్తలు అబద్ధమని.. ఆమె హీరోయిన్ గా నటిస్తుందని చెప్పాడు దిల్ రాజు. ఇప్పటికే 80 శాతం పూర్తైపోయిందని.. ఒక్కసారి లాక్ డౌన్ అయిపోతే వెంటనే సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేస్తామంటున్నాడు ఈయన.

More Related Stories