English   

పుష్పలో సూపర్ ట్విస్ట్.. రష్మికకు బన్నీ ఏమవుతాడంటే..

alluarjun
2020-04-18 19:54:12

రంగస్థలం తర్వాత సుకుమార్ మనసు మొత్తం మారిపోయింది. తను కూడా పూర్తిగా కిందకి దిగి నేల క్లాస్ ఆడియన్స్ కు కూడా అర్థమయ్యే సినిమాలు చేయాలని మెంటల్ గా ఫిక్సైపోయాడు. ఒక్కసారి ఆయన మాస్ సినిమా చేస్తే మేం తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే అని రాజమౌళి చెప్పిన మాటలను అక్షరాల నిజం చేసి చూపించాడు సుకుమార్. ఈయన కెరీర్ లో ఫస్ట్ టైమ్ చేసిన మాస్ సినిమా రంగస్థలం. అది ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు అల్లు అర్జున్ తో కూడా మరోసారి అలాంటి సినిమానే చేస్తున్నాడు. ఈ సారి కూడా లెక్కలు కన్ఫ్యూజన్ అని కాకుండా పూర్తిగా మాస్ సినిమా చేస్తున్నాడు. పుష్ప అనే టైటిల్ పెట్టినపుడే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఫస్ట్ లుక్ చూసిన తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని చూస్తున్నారు అభిమానులు.

ఈ చిత్రం కూడా రివేంజ్ డ్రామాగానే వస్తుందని ప్రచారం జరుగుతుంది. తన కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్లను చంపడానికి ఎర్ర చందనం స్మగ్లింగ్ ముఠాలో లారీ డ్రైవర్ గా చేరే పుష్పక్ నారాయణ్ కథే ఈ సినిమా అని తెలుస్తుంది. ఇందులో అల్లు అర్జున్, రష్మిక సినిమా మొదట్నుంచే భార్యాభర్తలుగా నటించబోతున్నారని తెలుస్తుంది. రష్మిక పాత్ర కూడా పూర్తిగా డీ గ్లామరైజ్డ్ గానే ఉండబోతుంది. ఇందులో రొమాన్స్, కామెడీ అలాంటివేం కనిపించవు.. పూర్తిగా ఎమోషనల్ డ్రామా ఈ చిత్రం. అల్లు అర్జున్ సినిమా మొదట్నుంచి కూడా పూర్తిగా బరువైన పాత్ర చేస్తున్నాడు. మొత్తానికి సుకుమార్ ఒక్కసారి దిగి సినిమాలు చేయడం మొదలుపెడితే మిగిలిన దర్శకులకు చుక్కలు కనిపించడం ఖాయం అనుకుంటా..

 

More Related Stories