English   

ఫైటర్ సినిమాను ఆయన రిజెక్ట్ చేస్తే విజయ్ చేస్తున్నాడా..?

arjun
2020-04-18 20:15:52

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ ఆపేసారు కానీ ఈయన చేతుల్లో ఉన్న పెద్ద ప్రాజెక్ట్ ఇదే. వరజ పరాజయాలతో పూర్తిగా డీలా పడిపోయిన విజయ్ కెరీర్ ఇప్పుడు తిరిగి గాడిన పడాలంటే ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఫైటర్. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరీ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా ఇది పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న డ్రామా. దీనికోసం విజయ్ కూడా భారీగానే కష్టపడుతున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండ అల్ట్రా మోడ్రన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన కొన్ని స్టిల్స్ చూస్తుంటే విజయ్ లుక్ బయటికి అర్థమవుతుంది. అయితే ఈ సినిమాను ముందు విజయ్ కోసం కాదు అల్లు అర్జున్ కోసం రాసుకున్నాడు పూరీ.

కానీ ఎందుకో తెలియదు కానీ బన్నీ ఈ స్పోర్ట్స్ డ్రామాపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆయనకు ముందు దేశముదురు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు పూరీ.. ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో లాంటి ఫ్లాప్ కూడా ఇచ్చాడు. అయితే పూరీ చెప్పిన కథ నచ్చలేదో లేదంటే ఆయనపై నమ్మకం లేకో తెలియదు కానీ ఈ చిత్రాన్ని బన్నీ చేయలేదు. ఆ తర్వాత రౌడీకి వచ్చింది. పాన్ ఇండియన్ సినిమాగా ఫైటర్ ను తెరకెక్కిస్తున్నాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి-ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి అల్లు అర్జున్ కాదనుకున్న కథలో దమ్ముందో లేదో త్వరలోనే తేలనుంది.

More Related Stories