English   

కరోనా నేపధ్యంలో దిల్ రాజు సినిమా

dilraju
2020-04-19 10:43:34

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలని అందరికీ నరకం చూపిస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ అయిపోగా కరోనో కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయని ప్రయత్నమె లేదు. ఇక ఈ కరోనా పై పోరులో భాగంగా రాత్రనక, పగలనక క్షేత్ర స్థాయిలో శ్రమిస్తున్న పోలీసులు, వైద్యులు అందరి ప్రశంశలు అందుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కరోనాపై పోలీసుల యుద్దం గురించి ఓ సినిమా తీస్తానని ప్రకటించాడు. రెండు మూడు రోజుల నుండి దిల్ రాజు పోలీసులకి అవసరమైన వస్తువులని అందచేస్తున్నారు. తాజాగా మాస్క్ లు, శానిటైజర్స్ దిల్ రాజు నిన్న పోలీస్ సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ కరోనా కారణంగా లాక్ డౌన్ తో ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయిన సమయంలో రాత్రనక, పగలనక సేవలందిస్తున్న డాక్టర్స్, పోలీస్, పారిశుధ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు.

తనకి పోలీస్ ల గొప్పతనాన్ని వివరిస్తూ ఒక మూవీ నిర్మించాలనే కోరిక ఎప్పటినుంచో ఉందని, ఇప్పుడు పోలీస్ శాఖ అందిస్తున్న సేవలతో ఆ కోరిక మరింత పెరిగిందని, త్వరలోనే ఈ నేపధ్యంలో ఒక సినిమా నిర్మిస్తానని దిల్ రాజు తెలిపారు. ఇక ఆయన నిర్మిస్తున్న సినిమాల విషయానికి వస్తే నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహన క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వి సినిమా ఈ నెలలో విడుదలకావాల్సి వుండగా కరోనా నేపథ్యంలో ఆ సినిమా వాయిదా పడింది. ఇక వకీల్ సాబ్ కూడా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.

 

More Related Stories