English   

మహేష్ కి బాలీవుడ్ భామను ఫైనల్ చేశారా ?

mb
2020-04-19 11:18:50

ఈ యేడాది మొదట్లోనే సంక్రాంతికి మహేష్ బాబు-అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కూడా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత సినిమాగా మహేష్ పరుశురామ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ముందు వంశీ పైడిపల్లి తో సినిమా ఉంటుందని అనుకున్నా కారణాలు ఏవయినా కానీ ఆ ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టారు. నిజానికి పరశురామ్ తో సినిమా ఇప్పటికే లాంచ్ కావాల్సి ఉన్నా అది కుదరలేదు. ఇక ఈ సినిమా కరోనా ఎద్దడి తగ్గాక కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31న లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంచించాలని ప్లాన్ చేస్తున్నారు.

  ఇక ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట్ ను కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి  మ్యూజిక్ డైరెక్టర్ గా గోపీ సుందర్ ని ఫైనల్ చేశారట మహేష్ అండ్ డైరెక్టర్. అదీ కాక ఈ సినిమాలో హీరోయిన్ గా   బాలీవుడ్  నటి   శ్రద్ధా కపూర్ పేరు రీసెంట్ గా   తెరపైకి  వచ్చింది. బాలీవుడ్ లో  శ్రద్ధా కపూర్ కి మంచి క్రేజ్ వుంది. అదీ కాక మొన్ననే ఆమె ప్రభాస్ సరసన ‘సాహో’ సినిమా చేసింది. ఆ సినిమా ఇక్కడ ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేదు. ఆ తరువాత ఆమె తెలుగు సినిమాలకి సైన్ చేయలేదు. పరశురామ్ తో మహేష్  బాబు చేయనున్న సినిమా కూడా పాన్ ఇండియా మూవీగానే రూపొందిస్తారని అందుకే  బాలీవుడ్ నుంచి శ్రద్ధా కపూర్ ను తీసుకునే దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని అంటున్నారు.  

 

More Related Stories