English   

మెగాస్టార్ చిరంజీవి రక్తదానం..

chiru
2020-04-19 16:29:39

లాక్‌డౌన్ వలన ప్రజలు ఇళ్ళ నుండి బయటకి రావడం లేదు. భారతదేశంలోని 130 కోట్ల మంది ఇంటికి పరిమితం అయిపోయారు దాంతో రక్తదానం చేసేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది ఒకప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా రెగ్యులర్ గా రక్త దానం చేసే వాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు  అందుకే కొందరు సెలబ్రెటీల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త దానం చేస్తున్నారు  మొన్నటికి మొన్న న్యాచురల్ స్టార్ నాని ఇదే చేశాడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్‌బ్యాంక్‌కు వెళ్లి రక్తదానం చేశాడు నాని. తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. తన చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశాడు. అందరం ఇళ్లల్లో ఉండడం వలన రోగులకి రక్తం అందక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో చాలామంది తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు వాళ్లకు రక్తం చాలా అవసరం ఉంది అంటున్నాడు చిరంజీవి నెలకు రెండు సార్లు రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు ఇతర ఆపరేషన్స్‌కు రక్తం అనేది చాలా అవసరం. కానీ ఇప్పుడు కరోనా భయం వల్ల చాలా మంది రక్తదానం చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు. ఇలాంటి భ్రమలను తొలగించి వాళ్లలో వారిలో అవగాహన కల్పించేందుకు ఇలా సెలబ్రిటీలు ముందుకు వస్తుండడం హర్షించదగ్గ విషయం.

 

More Related Stories