English   

యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ లవ్ స్టోరీ..

anasuya
2020-04-19 16:43:24

జబర్దస్త్ కామెడీ షో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినా కూడా ఎవరు గుర్తుపట్టలేదు.. కోరుకున్న గుర్తింపు కూడా రాలేదు. యాంకర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టిన అనసూయ ఇప్పుడు టాలీవుడ్ లో సత్తా చూపిస్తుంది కేవలం యాంకర్ గానే కాకుండా నటిగా కూడా దూసుకుపోతుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మకు రియల్ లైఫ్ లో అద్భుతమైన లవ్ స్టోరీ ఉంది. తాను ప్రేమించిన వాడి కోసం ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది సంవత్సరాల పాటు పోరాటం చేసింది ఈ ముద్దుగుమ్మ. చివరకు తను ప్రేమించిన వాడిని 2010 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది. అనసూయ లవ్ స్టోరీ ఇంటర్మీడియట్ లోనే మొదలైంది. ఓ సారి ఎన్ సి సి క్యాంపులో భరద్వాజ్ తనకు పరిచయం అయ్యాడని.. మొదటి పరిచయంలోనే నువ్వంటే ఇష్టం.. నీకు కూడా ఇష్టం అయితే పెళ్లి చేసుకుంటాను అని నేరుగా చెప్పేసాడు అని చెబుతోంది అనసూయ. టీనేజ్ కూడా దాటని ప్రాయంలో పెళ్లేంటని అనసూయకు ఆశ్చర్యం కలిగినా.. అతని ధైర్యం ఆమెకి నచ్చి భరద్వాజ్ గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. ఆ సంఘటన జరిగిన ఏడాదిన్నర తర్వాత మరోసారి ncc క్యాంపులో ఇద్దరు కలుసుకున్నారు. అప్పుడు మరోసారి తన ప్రేమ గురించి చెప్పాడు భరద్వాజ్.

కానీ ఈ ప్రేమకు ఆమె తండ్రి అస్సలు ఒప్పుకోలేదు. ఇంట్లో మరో ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో.. ప్రేమ వివాహం చేసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయని భావించిన అనసూయ తండ్రి భరద్వాజను అల్లుడుగా ఒప్పుకోలేదు. దాంతో తను ప్రేమించిన భరద్వాజ్ కోసం ఇంటి నుండి వెళ్ళిపోయి అనసూయ కొన్నాళ్ళు బయట హాస్టల్ లో ఉండి.. తండ్రి అంగీకారం కోసం చాలా సంవత్సరాల పాటు వేచి చూసింది. చివరకు విసిగిపోయి లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని అడిగినా భరద్వాజ్ పెద్దల అంగీకారం అవసరం అని ఆమెకు నువ్వు చెప్పేవాడని చెబుతుంది అనసూయ. ఎట్టకేలకు 2010లో ఫిబ్రవరి 10న 9 ఏళ్ల తరువాత పెద్దల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు. పెళ్లి తర్వాత ఈమె కెరీర్ మరింత వేగంగా ముందుకు వెళ్ళిపోయింది.

More Related Stories