English   

రాజమౌళి కి సవాల్ విసిరిన అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ..

rajamouli
2020-04-19 17:12:59

అదేంటి.. రాజమౌళికి ఒకే ఒక్క సినిమా అనుభవమున్న సందీప్ రెడ్డి వంగా సవాల్ విసరడం ఏంటి.. ఈయన రేంజ్ ఏంటి ఆయన రేంజ్ ఏంటి అనుకుంటున్నారా.. ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ ఇండస్ట్రీని కుదిపేసాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి తర్వాత అదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సంచలన విజయం అందుకున్నాడు. ఈయన ఇదిలా ఉంటే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలకు కూడా ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. పనివాళ్ళు అందరూ మానేయడంతో ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని తమ వాళ్లకు కావాల్సిన సాయం చేస్తున్నారు మన హీరోలు దర్శకులు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఇదే చేశాడు. ఆయన కూడా తన ఇంట్లో పూర్తిగా పనులు చేసుకుంటూ బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే ఇల్లు ఊడవడం.. అంట్లు తోమడం.. ఫ్లోర్ క్లీన్ చేయడం లాంటి పనులన్నీ చేశాడు. ఇవే పనులు దర్శక ధీరుడు రాజమౌళి కూడా చేయాలని డొమెస్టిక్ వర్క్ పేరుతో ఒక సవాల్ విసిరాడు సందీప్. తాను చేసిన పనులు మీరు కూడా చేయండి అంటూ రాజమౌళికి ఆయన సవాల్ విసిరాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి రాజమౌళి ఈయన సవాల్ ను స్వీకరిస్తాడో లేదో చూడాలి.

More Related Stories