ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా కుమారి హెబ్బా..

ఖలేజా సినిమాలో అనుష్కను మహేష్ బాబు అడుగుతాడు కదా ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా అని ఇప్పుడు హెబ్బాపటేల్ ను చూస్తే ఎవరైనా ఇదే అడగాలనుకుంటారు. కొందరికి కొన్ని సినిమాలు అలా గుర్తింపు తీసుకొస్తాయి. హెబ్బాకు అలా కలిసొచ్చింది. కుమారి 21 ఎఫ్ తో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ దానికి ముందే ఓ సినిమా చేసింది కానీ అది ఎవరికీ పెద్దగా తెలియదు. కుమారి తర్వాత ఇప్పటి వరకు మరో హిట్ లేదు ఈ భామకు. ఎక్కడికి పోతావు చిన్నవాడా హిట్టైనా కూడా అందులో నందితా శ్వేతా క్రెడిట్ అంతా పట్టుకుపోయింది. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా కూడా ఏది పెద్దగా క్లిక్ అవ్వలేదు. వరుణ్ తేజ్ లాంటి క్రేజీ హీరోలతో నటించినా హెబ్బాకు ఒరిగిందేమీ లేదు. పైగా అమ్మాయిగారు ఆంటీలా మారిపోయారు ఈ మధ్య. భయంకరంగా బరువు పెరిగిపోవడంతో హెబ్బాకు అవకాశాలే రావట్లేదు. దాంతో ఫిజిక్ పై బాగా సీరియస్ గా దృష్టి పెట్టింది ఈ కుమారి. దీనికి ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. గతంతో పోలిస్తే చాలా బరువు తగ్గిపోయింది ఈ భామ. పైగా అందాలు ఆరబోస్తూ తాజాగా ఓ ఫోటోషూట్ కూడా చేసింది. ఆ మధ్య 24 కిస్సెస్ సినిమాలో 24 ముద్దులు పెట్టినా కూడా వర్కవుట్ కాలేదు. దాంతో హాట్ షోపై ఆధారపడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇది చూసిన తర్వాత కచ్చితంగా హెబ్బాకు మళ్లీ అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. మరి చూడాలిక. ఏం జరుగుతుందో..?