English   

వకీల్ సాబ్ ని వేణు శ్రీ రామ్ డైరెక్ట్ చేయలేదా ..

 venu sriram
2020-04-20 11:19:05

ఇక సినిమాలే చేయను - నా జీవితం ప్రజలకి అంకితం అని చాలా సార్లు చెప్పిన పవన్ ఇప్పుడు ఏకంగా వరుసగా మూడు నాలుగు సినిమాలు ఒప్పుకుని తన అభిమానులకే కాక సినీ ప్రియులకు కూడా షాకిచ్చారు. ఆయన రీఎంట్రీ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకోగా వేసవి కానుకగా మే 15న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనా దెబ్బకు ఆ ప్లాన్ అంతా అప్సెట్ అయిందనుకోండి. ఆ విషయం పక్కన పెడితే వకీల్ సాబ్ సినిమాలో అంజలి, నివేత థామస్, మల్లేశం హీరోయిన్ అనన్యలు లీడ్స్ గా నటిస్తున్నారు. అయితే వకీల్ సాబ్ సినిమా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లో పవన్ కళ్యాణ్ భార్య పాత్రకి ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు, ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. 

అదేంటంటే ఈ సినిమాకి వేణు శ్రీరామ్ డమ్మీ డైరక్టర్ గా చేశారట. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్న పి.ఎస్ వినోద్ ఈ సినిమాకు షాడో డైరక్టర్ గా వ్యవహరించారనేది తాజాగా జరుగుతున్న చర్చ. వేణు శ్రీరామ్ కేవలం మానిటర్ దగ్గర కూర్చుని ఉండేవారని, పిఎస్ వినోదే షాట్ చెప్పి తనకి నచ్చినట్టుగా సినిమా చేసుకునే వారని అంటున్నారు. అయితే ఇది కేవలం పుకారా లేక నిజమా అనేది తెలియాల్సి ఉంది.  కరోనా వలన సినిమా విడుదల వాయిదా వేయక తప్పని పరిస్థితి. అయితే క‌రోనా కార‌ణంగా ‘వ‌కీల్ సాబ్‌’ ముందు అనుకున్నట్టు మే 15న‌ కాకుండా.. ఆగ‌స్టు 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని ద‌ర్శక‌నిర్మాత‌లు భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బోని కపూర్ సమర్పిస్తున్నారు.  
 

More Related Stories