English   

బ్రా.. లేదన్నారుగా అందుకే రెండు వేసుకున్నా...నటి సంచలనం 

Padma Lakshmi
2020-04-20 11:54:34

మోడల్ గా నటిగా మంచి పాపులారిటీ అందుకున్న పద్మాలక్ష్మి మరోమారు వార్తల్లోకి ఎక్కింది. యాంకర్ పద్మ లక్ష్మి.. పుట్టింది చెన్నైలో, పెరిగింది అమెరికాలో. ఈమె పూర్తి పేరు పార్వతి లక్ష్మి వైద్యనాధన్ అయితే అమెరికన్ పౌరసత్వం కలిగిన ఈమె ఒక మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తి. రచయిత్రి, నటి, మోడల్, టీవీ వ్యాఖ్యాత, నిర్మాతగా పాపులర్ అయిన పద్మ లక్ష్మి మంచి చెఫ్ కూడా. అందుకే ఆమె హాట్ నెస్ చూపిస్తూ కిచెన్ లో వివిధ రకాల వంటకాల్ని తన అభిమానులకు పరిచయం చేస్తూ ఉంటుంది.  ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ ఉండడంతో పద్మా లక్ష్మి ఇంట్లోనే ఉంటూ కొత్త వంటకాలు చేస్తోంది. మొన్నీమధ్య పద్మా లక్ష్మి డ్రెస్ టాప్ వేసుకున్నా బ్రా వేసుకోలేదని విషయాన్ని నెటిజన్లు ఇట్టే పసిగట్టారు. దీని మీద పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా చేశారు. 

ఇక తాజాగా ఆ విమర్శలకు మరో వీడియోలో పద్మా లక్ష్మి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. తానూ చేస్తున్న వంటకం గురించి చెబుతూనే పోయినసారి నేను బ్రా వేసుకోలేదని తిట్టారు.. ఇప్పుడు నేను రెండు బ్రాలు వేసుకున్నా.. వాళ్లంతా ఇప్పుడు హ్యాపీ అంటుకుంటా, అని చెబుతూనే మహిళల శరీరాలను పోలీసింగ్ (చెక్) చేయకుండా ఉంటే మంచిది అంటూ కామెంట్స్ చేసింది.  ఈ అమ్మడి వయసు ఇప్పుడు 49, హాట్ మోడల్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న పద్మాలక్ష్మి 2004 లో సల్మాన్ అనే రచయితను పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ళ కాపురం తరువాత వారిద్దరూ 2007 లో విడిపోయారు. తర్వాత పలువురితో డేటింగ్ చేసిన ఆమె ఒక పాపకి తల్లి కూడా అయింది. అయితే.. తండ్రి ఎవరో తెలుసుకోవటం కోసం ఆ పాపకు డీఎన్ఏ టెస్టు కూడా చేసింది అంటే ఆమె ఎంతటి బోల్డ్ మనిషో అర్ధం చేసుకోవచ్చు. 

More Related Stories