English   

రవితేజ సరసన ఆ ఇద్దరు హీరోయిన్స్ 

Ravi teja
2020-04-20 12:34:20

డిస్కో రాజా సినిమాతో మరో డిజాస్టర్ రుచి చూసిన రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మనోడికి కలిసి వచ్చిన దర్శకుడయిన గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేశారు. అయితే కరోనా దెబ్బకు ఆ సినిమా విడుదల వాయిదా పడినట్టే. అయితే ఇక ఈ సినిమాతో పాటు రవితేజ మరో సినిమాలో నటించబోతున్నాడు. రాక్షసుడు ఫేం రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా ఒప్పుకున్నాడు. ‘రాక్షసుడు’తో విజయాన్ని అందుకున్న రమేష్‌ వర్మ చెప్పిన కథకి రవితేజ బాగా కనెక్ట్ అయ్యారని ప్రచారం జరిగింది. 

క్రాక్ పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కావాల్సి ఉంది. అయితే కరోనా బ్రేక్ వేసింది అనుకోండి. అయితే ఈ సినిమా కధ రిలీజ్ కి నోచుకోని ఒక తమిళ సినిమాకి రీమేక్ అని అంటున్నారు. అరవింద స్వామి హీరోగా త్రిష హీరోయిన్ గ సతురంగ వెట్టై 2, 1818 అనే థ్రిల్లర్ సినిమా రిలీజ్ కావలసి ఉంది. అది 2018 నుండి ఇప్పటిదాకా రిలీజ్ కాలేదు. ఆ సినిమానే ఇప్పుడు రమేష్ వర్మ హక్కులు కొని మరీ సినిమా చేస్తున్నట్టు చెబుతున్నారు. 

ఆ విషయం పక్కన పెడితే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. ఇప్పటికే ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన యూనిట్, ఇప్పుడు మరో హీరోయిన్ గా నభా నటేష్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు ఫైలిన్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇస్మార్ట్ శంకర్ లో ఈ ఇద్దరూ హీరోయిన్స్ గా నటించారు. మళ్లీ ఇప్పుడు రవితేజ సినిమాలో హీరోయిన్స్ గా ఫైనల్ అయితే కలిసి నటించే రెండి సినిమా అవుతుంది. అయితే ఈ వార్త కేవలం పుకారుగా మిగులుతుందా ? లేక నిజమవుతుండా ? అనేది చూడాలి.  

More Related Stories